నార్త్ లో మాత్రమే పాపులర్ అనుకున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షో సౌత్ లో కూడా బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో ఈ షో కి విశేష ఆదరణ దక్కింది. మొదటి సీజన్ నే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో హోస్ట్ చెయ్యడంతో ఈ షోకి మంచి వెల్కమ్ దక్కినట్టు అయ్యింది. ఇక రెండో సీజన్ ను నాని కూడా అదే స్థాయిలో సక్సెస్ అయ్యేలా చేసాడు. ఇక మూడో సీజన్ ను హోస్ట్ చేసిన నాగార్జున అయితే..’బిగ్ బాస్’ కు మరింత గ్లామర్ తెచ్చాడని చెప్పడంలో అతిశయోక్తిలేదు.
అందుకే నాలుగో సీజన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ‘బిగ్ బాస్4’ ను లేట్ గా మొదలుపెట్టబోతున్నారు. అంతేకాదు ఈ నాలుగో సీజన్ కు ఎక్కువగా మార్పులు కూడా చేస్తున్నారట. ముందుగా ‘బిగ్ బాస్4’ ను 50 రోజులు మాత్రమే నిర్వహించనున్నారట. వైల్డ్ కార్డు ఎంట్రీలు ఈసారి ఉండవని తెలుస్తుంది. ఒకసారి ఎలిమినేట్ అయినవాళ్ళు .. అలాగే కొత్తవాళ్ళను హౌస్ లోకి పంపడం గత మూడు సీజన్లుగా చూస్తూనే వస్తున్నాం. కానీ ఈసారి మాత్రం అలాంటివి ఉండవట.
అంతేకాదు ఫిజికల్ టాస్క్ లు కూడా ఉండని టాక్. అన్నీ కూడా టెక్నికల్ గా ఆలోచించే టాస్క్ లే ఉంటాయని సమాచారం.అంతేకాదు హౌస్ లో ఉండే కంటెస్టెంట్ లు హగ్ లు ఇచ్చుకోవడం వంటివి కూడా నిషేధించడం అయ్యిందట. కంటెస్టెంట్ లు హౌస్ లో ఉన్నన్ని రోజులు భౌతిక దూరం పాటిస్తూ టాస్క్ లు ఆడాల్సిందేనని సమాచారం. కాబట్టి ఈసారి ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్ కు నిరాశ అనే చెప్పాలి.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?