Ante Sundaraniki: హిట్ టాక్ వచ్చినా.. ‘అంటే సుందరానికీ!’ కి కలెక్షన్స్ రాకపోవడానికి కారణాలు అవేనా..!

‘అంటే సుందరానికీ!’ … నాని నటించిన లేటెస్ట్ మూవీ. జూన్ 10న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద టాక్ కు తగ్గట్టు కలెక్షన్లను రాబట్టలేకపోతోంది. వీకెండ్ ఓపెనింగ్స్ చూసుకుంటే చాలా తక్కువగా నమోదయ్యాయి. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు. సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ చిత్రం ఇంత ఘోరంగా పెర్ఫార్మ్ చేయడానికి కారణాలు చాలా ఉన్నాయి.

‘అంటే..’ రిలీజ్ కావడానికి వారం రోజుల ముందు ‘మేజర్’ ‘విక్రమ్’ వంటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘విక్రమ్’ చిత్రానికి రిపీటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు. ఇక ‘మేజర్’ చిత్రాన్ని కచ్చితంగా ఒకసారైనా చూడాలని జనాలు ఫిక్స్ అయ్యారు. ఆ సినిమాలకి టికెట్ రేట్లు కూడా చాలా తక్కువ. అందుకే ‘విక్రమ్’ ‘మేజర్’ ఇంకా రాణిస్తున్నాయి. కానీ నాని నటించిన ‘అంటే సుందరానికీ!’ టికెట్ రేట్లు పెంచలేదు.. అలా అని తగ్గించనూ లేదు.

వరుసగా పెద్ద సినిమాలు చూసిన జనాలు ‘అంటే..!’ కి ఎక్కువ టికెట్ రేట్లు పెట్టుకుని ఎందుకు వస్తారు? ‘అంటే సుందరానికీ!’ చిత్రానికి సింగిల్ స్క్రీన్ లలో రూ.175, మల్టీప్లెక్సుల్లో రూ.250 కి పైగా ఉన్నాయి. ఈ టికెట్ రేట్లు తగ్గించి ఉంటే.. జనాల్లో ఈ చిత్రం చూడాలనే ఆసక్తి పెరిగేది. అంతే కాకుండా ‘మైత్రి’ వారి సినిమాలు ఈ మధ్య కాలంలో 3,4 వారాలకే ఓటీటీకి వచ్చేస్తున్నాయి.

‘అంటే!’ కూడా అదే విధంగా వచ్చేస్తుంది అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు…! వీటి పై నిర్మాతలు ముందుగా అంచనా వేసి ప్రమోషన్ చేసి ఉంటే కచ్చితంగా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ నమోదయ్యి ఉండేవి..!

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus