Mahesh, Rajamouli: జక్కన్న సినిమాలో మహేష్ పాత్ర వెనుక ట్విస్టులివేనా.. ఏమైందంటే?

Advertisement

మహేష్ (Mahesh Babu) రాజమౌళి (SS Rajamouli) కాంబో మూవీ షూట్ అంతకంతకూ ఆలస్యం కావడం అభిమానులను ఒకింత నిరాశకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా మహేష్ బాబు పుట్టినరోజుకు నెలరోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. అయితే జక్కన్న సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని ఒక పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.

అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వరల్డ్ ట్రావెలర్ గా మరో రోల్ ఉంటుందని భోగట్టా. త్వరలో ఈ సినిమా మ్యూజిక్ కు సంబంధించిన పనులు మొదలు కానున్నాయని సమాచారం అందుతోంది. ప్రస్తుతం జక్కన్న టెస్ట్ షూట్స్ చేస్తున్నారని భోగట్టా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్టోరీ లాక్ అయిందని పాన్ వరల్డ్ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా కథ విషయంలో జక్కన్న ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మహేష్ జక్కన్న కాంబో మూవీ 2027లో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. రాజమౌళి నత్త నడకన సినిమాలను తెరకెక్కిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ జక్కన్న కాంబో మూవీ కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ అభిమానులకు సైతం స్పెషల్ మూవీ కాగా ప్రస్తుతం మహేష్ ఈ సినిమాకే పరిమితం కావడం గమనార్హం. ఈ సినిమా బడ్జెట్ పరంగా కూడా సంచలనాలు సృష్టిస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి షూటింగ్ మొదలుకాకముందే భారీ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus