Mahesh , Trivikram: త్రివిక్రమ్ మూవీ విషయంలో అసంతృప్తితో మహేష్.. ఏం జరిగిందంటే?

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కగా అతడు సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఖలేజా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్ హిట్ గా నిలిచింది. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత మరో సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమా షూటింగ్ కొన్నిరోజుల క్రితం వరకు శరవేగంగా జరిగింది. కొన్నిరోజుల క్రితం మాల్ లో తీసిన సీన్లను స్క్రాప్ చేస్తున్నట్టు త్రివిక్రమ్ చెప్పడం మహేష్ కు కోపం తెప్పించిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

త్రివిక్రమ్ తన సినిమా కాకుండా ఇతర ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టడం మహేష్ కు చిరాకు తెప్పిస్తోందని వైరల్ అయిన వార్తల సారాంశం. ఈ ప్రాజెక్ట్ విషయంలో మహేష్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో మహేష్ ఫ్యాన్స్ సైతం తెగ ఫీలవుతున్నారు. అయితే నిర్మాత నాగవంశీ మాత్రం వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పినట్టు సమాచారం అందుతోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమాకు సంబంధించి ఇప్పటివరకు టైటిల్ ను కూడా ప్రకటించలేదు.

ఈ ఏడాది ఆగష్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడిందనే సంగతి తెలిసిందే. షూటింగ్ నత్తనడకన సాగితే ఆ సమయానికి కూడా ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని చెప్పవచ్చు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆలస్యం అయితే ఆ ప్రభావం మహేష్ రాజమౌళి సినిమాపై పడుతుంది. ఈ సినిమా ఆలస్యం కావడం మహేష్ ఫ్యాన్స్ కు ఏ మాత్రం ఇష్టం లేదు.

మహేష్ (Mahesh) త్రివిక్రమ్ కాంబో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడంతో పాటు కొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలాంటి రూమర్లు వైరల్ కాకుండా సినిమా విషయంలో త్రివిక్రమ్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus