RRR Release Date: రెండేళ్ల క్రితం అనుకున్న డేట్‌కే వస్తారా..!

ఎక్కడ మొదలుపెట్టావో… అక్కడికే వచ్చి ఆగుతావు నాయనా? – ఈ డైలాగ్‌ గుర్తుందా… అదేదో సినిమాలో బ్రహ్మానందాన్ని చూసి పవన్‌ కల్యాణ్ అనే మాట ఇది. ఇప్పడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి ఇలాంటి డైలాగ్‌ ఒకటి వేయొచ్చు. రెండేళ్ల క్రితం ఏ రోజు అనుకున్నావో… ఈ ఏడాది అదే రోజుకు వస్తున్నావా నాయనా. అని. అవును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ న్యూ రిలీజ్‌ డేట్‌ అంటూ ఓ తేదీ సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అదే జరిగితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫ్యాన్స్‌ ఇంకొన్ని నెలలు ఆగాల్సి ఉంటుంది.

సంక్రాంతికి అంతా రెడీ అనుకుని ‘భీమ్లా నాయక్‌’, ‘రాధేశ్యామ్‌’, ‘సర్కారు వారి పాట’ రెడీగా ఉంటే… ‘నేనొచ్చేస్తా’ అంటూ సంక్రాంతికి వారం ముందు రోజుని డేట్‌గా అనౌన్స్‌ చేశారు. ఆ తర్వాత మహేష్‌బాబు, పవన్‌ కల్యాణ్ లాంటి స్టార్‌ హీరోలు… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి సైడ్‌ ఇచ్చేశారు. కానీ ప్రపంచాన్ని గత రెండున్నరేళ్లుగా వణికిస్తున్న విలన్‌ ‘కరోనా’ మాత్రం సైడ్‌ ఇవ్వలేదు. ‘నేను రానివ్వను, వస్తే నీ ఇష్టం’ అంటూ ‘ఒమిక్రాన్‌’ రూపంలో అడ్డు పడింది. ఇంకేముంది సినిమా రిలీజ్‌ అగిపోయింది.

అంత భారీ సినిమాను ఇన్ని కరోనా ఆంక్షల మధ్య విడుదల చేస్తే ఇబ్బంది తప్పదని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు కోరడంతో చిత్రబృందం వెనక్కి తగ్గింది. జనవరి 7 న సినిమా తీసుకురావడం లేదని చెప్పింది. అయితే నెక్స్ట్ ఏ డేట్‌ ఎంచుకుంటున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కరోనా కష్టాలు కనీసం మూడు నెలలు ఉంటాయి అని చెబుతున్నారు. అదే జరిగితే ఏప్రిల్‌ వరకు సినిమా తీసుకురావడం కష్టం. కాబట్టి సినిమా రిలీజ్‌కు జులైన సరైన సమయం అని అనుకుంటున్నారట.

ఒకవేళ జులైలో సినిమా వస్తే… రెండేళ్ల క్రితం అనుకున్న నెలలో సినిమా వస్తున్నట్లు. అవును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రారంభించిన కొత్తల్లో 2020 జులైలో సినిమా తీసుకొస్తామని చెప్పారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు తిరిగి తిరిగి రెండేళ్ల తర్వాత అదే నెలలో సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని సమాచారం. ఒకవేళ అదే జరిగితే మళ్లీ మే నుండి సినిమా ప్రచారం షురూ చేయాల్సి ఉంటుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus