బడా నిర్మాత పై ఇలా కూడా సెటైర్లు వేస్తారా?

ఇటీవల అగ్ర నిర్మాత సురేష్ బాబు చేసిన ఓ కామెంట్ పెద్ద చర్చకు దారి తీసింది. ‘ చిన్న సినిమాలకు ఆదరణ తగ్గింది.. కంటెంట్ లేని వాటిని అమెజాన్ – నెట్ ఫ్లిక్స్ లో చూసేందుకు జనం అలవాటు పడుతున్నారు.. థియేటర్లకు రావడం లేదు’ ఇది సురేష్ బాబు చేసిన కామెంట్. ఇలా సురేష్ బాబు చేసిన కామెంట్ నిజమే అని చెబుతూనే… ఈయన పై సెటైర్లు వేస్తున్నారు చిన్న నిర్మాతలు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘సురేష్ బాబు గారు చెప్పింది నూటికి నూరు శాతం నిజం… కంటెంట్ లేని చిన్న సినిమానే కాదు .. పెద్ద సినిమాని కూడా జనం థియేటర్లలో చూడటం లేదు. అయితే జనాలు థియేటర్లకు రాకపోవడానికి కారణమేమిటి? అంటే.. మెజారిటీ జనాలకు టైం లేక రావడం లేదు. రూ.100- 150 పెట్టి 2 గం.టైం వేస్ట్ చేయలేక.. జనాలు థియేటర్లకు రావడం లేదు. అయితే ఇవేవీ పట్టించుకోని కొత్త నిర్మాత.. దర్శకుడు తాను గొప్పగా తీసాను అనుకున్న సినిమాని జనం చూడలి అనుకుంటాడు. అమెజాన్- నెట్ ఫ్లిక్స్ వల్ల ఆ కోరిక తీరుతోంది. జనం థియేటర్లకు వచ్చినా రాకపోయినా.. ‘చిన్న సినిమాలు మాత్రం ఈ రకంగా అయినా జనానికి చేరువ అవుతున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థల వల్ల నిర్మాత కి ఎంతో కొంత ఆదాయం వస్తోంది. కాబట్టి అమెజాన్- నెట్ ఫ్లిక్స్ వంటివి చిన్న నిర్మాతలకి ఓ వరం’ అంటూ సమాధానం చెబుతూనే సెటైర్లు కూడా వేశారు.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus