Prabhas: 17 ఏళ్ళ తర్వాత ఆ ఫ్లాప్ సెంటిమెంట్ ను ప్రభాస్ జయిస్తాడా..?

ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ ఈ శుక్రవారం అంటే మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కూడా ఆర్.ఆర్.ఆర్ తో సమానంగా మొదలైన మూవీ. కానీ అనేక కారణాలతో పాటు కోవిడ్ కారణంగా ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. చివరాఖరికి సంక్రాంతి కి రిలీజ్ చేద్దాం అనుకున్నా ధర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఇప్పుడు మార్చి 11 న ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయాలని చిత్ర బృందం బలంగా ఫిక్స్ అయ్యింది.

అందుకు తగ్గట్టే ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విడుదల చేసిన ప్రోమోలు, పాటలు బాగున్నాయి. సినిమా పై అంచనాల్ని కూడా పెంచాయి. అయితే ఓ బ్యాడ్ సెంటిమెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతుంది అదేంటి అంటే….మార్చి నెల ప్రభాస్ కు ఎంతమాత్రం కలిసి రాలేదు. రెండు సార్లు ఎదురుదెబ్బలు తగిలాయి.2003 లో ప్రభాస్ రెండో సినిమాగా వచ్చిన రాఘవేంద్ర మార్చి నెలలో విడుదలైంది. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది.

అటు తర్వాత 2005 లో వచ్చిన చక్రం మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ రెండిటినీ స్టార్ డైరెక్టర్లే తెరకెక్కించారు. కానీ ఫ్లాప్ ఫలితాలే నమోదయ్యాయి. 17 ఏళ్ళ తర్వాత మళ్లీ రాధే శ్యామ్ తో మార్చి నెలలో వస్తున్నాడు ప్రభాస్. మరి ఈ మూవీతో హిట్టు కొట్టి ఆ ఫ్లాప్ సెంటిమెంట్ కు ఫుల్ స్టాప్ పెడతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus