Actress Nalini: ‘కిక్’ నటి నళిని జీవితంలో ఉన్న ట్రాజెడీ గురించి మీకు తెలుసా?

ముహూర్తాలు, జాతకాలను మూడ నమ్మకాల కింద కొట్టిపారేసేవారు కొందరైతే.. వాటిని నమ్మి కాలు కూడా బయటపెట్టని వారు ఇంకొందరు. ఇలాంటి జాతకాలు జీవితాలనే తలక్రిందులు చేసిన సంఘటనలు కొకొల్లలు. జాతకాలను నమ్మే వారి వల్ల అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణే అలనాటి హీరోయిన్ నళిని జీవితం. అలా చెబితే టక్కున గుర్తురావడం కష్టమే కానీ ‘‘అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనే’’ అనే ఓల్డ్ సింగ్ చూస్తే నళిని ఎవరో తెలుస్తోంది.

ఇప్పటితరానికి ఈమెను గుర్తుచేయాలంటే కిక్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ మథర్ అని చెప్పాలి.అయితే గతంలో ఈమె తన అందం, అభినయంతో చాలా తక్కువ సమయంలోనే దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమె అసలు పేరు రాణి. ఈమె తండ్రి వై.కే మూర్తి సినిమాల్లో కొరియోగ్రాఫర్. బాలనటిగా పలు సినిమాల్లో నటించిన నళిని ఆ తర్వాత టీ.రాజేంద్ర దర్శకత్వంలో నటించిన ‘‘ప్రేమ సాగరం’’ ఆమెకు పాపులారిటీ తెచ్చింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.

ఆమె భర్త రామరాజన్ కు కోలీవుడ్ లో మంచి పేరుంది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్న రోజుల్లోనే నళినిపై మనసు పడ్డాడు. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఏకంగా నళిని తల్లితో చెప్పడంతో ఆమె అతనిని చావబాదారట. ఈ ఘటన తర్వాత అతనికి దూరంగా వుంచేందుకు గాను తమిళ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మలయాళ సినిమాలకే ఓకే చెప్పారట నళిని తల్లి. అయితే ఆ తర్వాత నటి జీవిత సాయంతో నళిని – రామరాజన్ ను వివాహం చేసుకున్నారు.

వారికి ఇద్దరు కవలలు. జీవితం సాఫీగా సాగుతున్న దశలో జాతకాలను నమ్మే అలవాటున్న రాజరాజన్.. వారి పిల్లల జాతకాల రీత్యా వారిని హాస్టల్ లో ఉంచుదాం అంటూ భార్య నళినితో అన్నారట. దీంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో కొన్నాళ్లు దూరంగా వున్నారు. అయితే పిల్లల పెళ్లి సమయంలో మాత్రం నళిని, రామరాజన్ లు తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు నిర్వర్తించారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus