Jagadam Movie: 15 ఏళ్ళ ‘జగడం’ రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్..!

‘దేవదాసు’ తర్వాత రామ్.. ‘ఆర్య’ తర్వాత సుకుమార్… రెండో చిత్రంగా ‘జగడం’ చేసారు. ఇద్దరూ బ్లాక్ బస్టర్లతో ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఈ మూవీ పై భారీ అంచనాలు నమోదయ్యాయి. 2007 వ సంవత్సరం మార్చి 16న భారీ అంచనాల నడుమ ఈ మూవీ రిలీజ్ అయ్యింది.నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఏట ప్రవేశిస్తోంది.’జగడం’ అంటే ఇద్దరూ కలిసి ఓ లవ్ స్టోరీతో వస్తున్నారు అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఇది పూర్తిగా డిఫరెంట్ మూవీ. ఇది బాగా ఆడలేదు.

Click Here To Watch Now

డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ మూవీని పొగడని సెలబ్రిటీలు అంటూ ఉండరు. రాజమౌళి అయితే ఈ సినిమాని వర్ణిస్తూ ఎక్సయిట్ అవుతుంటారు. అసలు ‘జగడం’ ఆలోచన ఎలా పుట్టింది అని ఓ సందర్భంలో సుకుమార్ ను అడిగితే.. “చిన్నప్పటి నుండీ ఒక విషయం నాకు ఇన్స్పిరేషన్ గా ఉండేది. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే… నేను వెళ్ళేసరికి ఆ గొడవ ఆగిపోతుండేది. కొట్టుకుంటారేమో, కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉండేది. నేను ఎదుగుతున్న క్రమంలోనూ ఆ ఆలోచన పోలేదు. ఎక్కడైనా కొట్లాటలో వాళ్ళు కొట్టుకోలేదంటే డిజప్పాయింట్ అయ్యేవాడిని.

నా స్నేహితులైనా అరుచుకుంటుంటే బాధ అనిపించేది. వీళ్ళు కొట్టుకోవడం లేదేంటి? అని! ఎక్కడో మనలో వయలెన్స్ ఉంది. వయలెన్స్ చూడాలని తపన ఉంది. ఎగ్జామ్పుల్ కి అడవిని తీసుకుంటే అందులో ప్రతిదీ వయలెంట్ గా ఉంటుంది. పులి-జింక తరహాలో ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. ఎక్కడ చూసినా బ్లడ్ ఉంటుంది. ‘ఆహారాన్ని సాధించే దారి అంతా వయలెన్స్ తో ఉంటుంది. అలాగే, సెక్స్ ను సాధించే దారి ప్రేమతో ఉంటుంది.’ – ఇలా ఎదో అనుకున్నాను. దాని నుంచి మొదలైన ఆలోచనే జగడం.

మన చుట్టుపక్కల చూస్తే… చిన్నపిల్లలు ఎవరైనా పడిపోతే, దెబ్బ తగిలితే… ‘నిన్ను కొట్టింది ఇదే నాన్నా’ అని రెండుసార్లు కొట్టి చూపిస్తాం. ఇటువంటి విషయాలు నాలో కనెక్ట్ అయ్యి ఓ సినిమా సినిమా చేద్దామని అనుకున్నా. రివెంజ్ ఫార్ములాలో. ‘ఆర్య’ కంటే ముందే ‘జగడం’ చేద్దామనుకున్నా. నా దగ్గర చాలా ప్రేమకథలు ఉన్నాయి. ‘ఆర్య’ తర్వాత వాటిలో ఏదైనా చేయవచ్చు. వయలెన్స్ నేపథ్యంలో కొత్తగా ఏదైనా చేద్దామని అనుకున్నా. అప్పటికి నాలో ఆలోచనలు రకరకాలుగా మారి ‘జగడం’ కథ రూపొందింది.

సినిమా బాగా రాలేదు అని నేను అనను. ఆ టైములో జనాలు రిసీవ్ చేసుకోలేదు. రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుండో ఉంది. తప్పకుండా అతనితో సినిమా చేస్తా. నిజానికి… ఇప్పటి రామ్‌తో మళ్ళీ ‘జగడం’ రీమేక్ చేయాలని ఉంది. మళ్ళీ ఇప్పటి రామ్‌తో మళ్ళీ ‘జగడం’ చూసుకోవాలని ఉంది. ప్రస్తుతం ‘పుష్ప2’ పనుల్లో బిజీగా ఉన్నాను. అన్నీ కుదిరితే కచ్చితంగా ‘జగడం’ రీమేక్ అయినా చేస్తా లేదంటే సీక్వెల్ అయినా చేస్తా..! కానీ దానికి ‘జగడం2’ అనే టైటిల్ మాత్రం పెట్టను” అంటూ సుకుమార్ చెప్పుకొచ్చాడు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus