క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ.. తన కొడుకు సంజయ్ రావుని ‘ఓ పిట్ట కథ’ చిత్రంతో లాంచ్ చేసాడు. లాక్ డౌన్ కు 3వారాల క్రితం రిలీజైన ఈ చిత్రం థియేట్రికల్ పరంగా ఏమాత్రం సక్సెస్ సాధించలేదు. తన సర్కిల్ అంతా ఉపయోగించి బ్రహ్మాజీ ఈ చిత్రాన్ని తెగ పరిచయం చేసాడు. మహేష్ బాబు తో టీజర్ రిలీజ్ చేయించాడు.మెగాస్టార్ చిరంజీవిని ప్రీ రిలీజ్ కు ఆహ్వానించాడు. అయినా ఫలితం దక్కలేదు. ఏమాత్రం టికెట్లు తెగ లేదు. అయినప్పటికీ ఈ చిత్రం లాభాల బాట పట్టిందట.
అదెలా అనుకుంటున్నారా? లాక్ డౌన్ మొదలవ్వడానికి నాలుగు రోజుల ముందు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసేసారు. ‘ఓ పిట్ట కథ’ ను నిర్మాత మీడియేటర్ కు 75 లక్షలకు అమ్మేసాడట. ఆ మీడియేటర్ అమేజాన్ ప్రైమ్ వారికి పే ఫర్ వ్యూ పద్ధతిలో అమ్మేసాడట.ఇక్కడ వ్యూకి పది రూపాయల చెప్పున అమేజాన్ లెక్కగట్టిందని సమాచారం. అమెజాన్ లో ఈ చిత్రాన్నిగట్టిగా చూశారట. ఇప్పటి వరకూ ఈ చిత్రం 4 కోట్ల వరకూ సంపాదించిందట.
ఈ చిత్రానికి బడ్జెట్ 1.25 కోట్లయ్యిందని సమాచారం. ఆ రకంగా చూసుకుంటే.. ఈ చిత్రానికి లాభాలు వచ్చినట్టే. కానీ లెక్క ప్రకారం ఈ లాభాలు నిర్మాతకు రావట. అయితే మీడియేటర్ తో చేసుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారం.. ‘ఓ పిట్ట కథ’ డిజిటల్ రైట్స్ నిర్మాత దగ్గరే ఉన్నాయట. వాటిని ఆ మీడియేటర్ మరో కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడని తెలుస్తుంది. ఆ రకంగా… సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత లాభాలతో గట్టెక్కేసాడని తెలుస్తుంది.
Most Recommended Video
ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!