War 2 Movie: ఆ ప్లాన్ వర్కౌట్ అయితే వార్2 ఇండస్ట్రీ హిట్ అవుతుందా?

హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న వార్2 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. 2025 సంవత్సరం ఆగష్టు నెల 14వ తేదీన ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. గురువారం రోజున ఈ సినిమా రిలీజ్ కానుండటంతో లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. అయితే వార్2 రిలీజ్ డేట్ వెనుక సరైన ప్లానింగ్ ఉందని సమాచారం అందుతోంది. పోటీ లేకుండా ఎక్కువ సెలవులు ఉన్న డేట్ కావడం వల్లే ఈ డేట్ ను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది.

మొదట ఈ సినిమాను 2025 సంవత్సరం జనవరి 25వ తేదీన రిలీజ్ చేయాలని భావించగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం సరిపోదని భావించి రిలీజ్ డేట్ ను మార్చారని తెలుస్తోంది. స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వార్2 సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా హృతిక్, ఎన్టీఆర్ కాంబో కావడంతో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

(War 2) వార్2 సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. అయితే ఆ పాత్ర ఏ విధంగా ఉండబోతుందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. ఏడాదికి ఒక సినిమా రిలీజయ్యేలా తారక్ ప్లానింగ్ ఉండగా తారక్ భవిష్యత్తు మూడు సినిమాలతో మరోసారి హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సినిమా సినిమాకు తారక్ రేంజ్ పెరుగుతుండగా భవిష్యత్తు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయేమో చూడాల్సి ఉంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేసే ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తారేమో చూడాల్సి ఉంది. కథ, కథనం విషయంలో తారక్ జాగ్రత్తలు తీసుకుంటుండగా నటించే సినిమాలు కమర్షియల్ హిట్లుగా నిలిస్తే మాత్రం తారక్ ప్లాన్ వర్కౌట్ అయినట్టే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పారితోషికం ఒకింత భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus