కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా దేశంలోని పారిశ్రామిక వేత్తలు, సినీతారలు, సామజిక వాదులు ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటిచడం జరిగింది. ముఖ్యంగా అన్ని పరిశ్రమలోని స్టార్ హీరోలు భారీ విరాళాలు ప్రభుత్వాలకు అందించారు. వీరిలో కొందరు హీరోలు ప్రత్యేకంగా నిలిచారు. సొంత రాష్ట్రాలతో పాటు, వీరు దేశానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా విరాళాలు ప్రకటించారు. వీరిలో ముందుగా చెప్పుకోవలసింది హీరో ప్రభాస్. ఆయన ఏకంగా 4 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి 3కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల సాయం చేశారు. అలాగే మరో 50 లక్షలు కరోనా క్రైసిస్ ఛారిటీకి ఇవ్వడం జరిగింది.
పవన్ కళ్యాణ్ మొత్తంగా రెండు కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అందులో కేంద్రానికి 1 కోటి తెలుగు రాష్ట్రాలకు చెరో 50లక్షలు అందించారు. అల్లు అర్జున్ ఏపీ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెరో 50 లక్షలు మరియు 25 లక్షలు పక్కనే ఉన్న కేరళ రాష్ట్రానికి దానం చేయడం జరిగింది. ఇక తమిళ్ స్టార్ హీరో విజయ్ కేంద్ర ప్రభుత్వానికి 25 లక్షలు, తమిళనాడుకి 50 లక్షలతో పాటు ఏపీ మరియు తెలంగాణాలతో పాటు పొరుగున ఉన్న అన్ని రాష్ట్రాలకు 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. కేరళకు మాత్రం ఆయన 10 లక్షలు సాయం చేయడం జరిగింది.
ఐతే ఈ హీరోలు ఇలా పక్క రాష్ట్రాలకు కూడా ఆర్థిక సాయం ప్రకటిచడం వెనుక వాళ్ళ సినిమా మార్కెట్ దృష్టిలో పెట్టుకొనే అని అర్థం అవుతుంది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో ఆయనకు బాలీవుడ్ లో భారీ ఇమేజ్ ఏర్పడింది. దీనితో ఆయన అక్కడ బాలీవుడ్ హీరోలకు తగ్గకుండా కేంద్రానికి 3 కోట్లు ప్రకటించారు. ఇక అల్లు అర్జున్ కి కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, దీనిని దృష్టిలో పెట్టుకొని ఆ గవర్నమెంట్ కి ఆయన 25లక్షలు ప్రకటించారు. పవన్ బీజేపీ లో ఉన్నారు కాబట్టి కేంద్రానికి మద్దతుగా నిలిచారు. ఇక హీరో విజయ్ విషయానికి వస్తే ఆయన సౌత్ లో సూపర్ స్టార్ గా ఎదుగుతున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన సినిమాలు సౌత్ మొత్తం ముఖ్యంగా తెలుగు మరియు మాలయంలో బాగా ఆడుతున్నాయి. దీనితో ఈయన కేంద్రంతో పాటు, సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ హీరోల దానాల వెనుక మార్కెట్ విస్తరణ కార్యక్రమం దాగివుంది అనడంలో సందేహం లేదు.