తొలి సినిమాతోనే జాన్వీ లెవల్ మారిపోయిందా ?

చాలా మంది జీవితాల్లో విజయానికి ముందు.. తర్వాత మార్పు కనిపిస్తుంది. కొంతమందికి మాటతీరులో మార్పు వస్తే.. మరికొంతమదిలో నడవడికలో మార్పు తీసుకొస్తుంది. ఇక సినిమా ప్రపంచంలో హిట్ అందుకుంటే వారి రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. పెంచేస్తారు.. పెంచాల్సివస్తుంది. ఆ విషయం శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ విషయంలో మరో సారి నిరూపితమైంది. ఆమె నటించిన దఢక్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. స్టార్ హీరోలకు సమానంగా ఆ చిత్రం కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇంకేముంది ఓ వైపు సినిమా ఆఫర్లు.. మరో వైపు బ్రాండింగ్ చేయాలనీ ప్రముఖ సంస్థలు క్యూలో ఉన్నారు. సో ఆటోమేటిక్ గా జాన్వీ లెవల్ మారిపోయింది. ఆమె ఇంటి నుంచి బయటపెడితే నిర్వహణ ఖర్చు లక్షలు దాటుతోంది.

వేసుకునే డ్రస్సే లక్ష రూపాయల పైనే ఉందంటే లెవల్ ఏ స్థాయిలో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా సింగపూర్ వెళ్లిన జాన్వీ నిన్న ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగింది. ఖరీదైన దుస్తుల్లో కనిపించింది. ఆమె ధరించిన కాటన్ జెర్సీ ఖరీదు 33 వేలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. స్లీవ్‌తో ఉన్న సెయింట్ లారెంట్ బాయ్‌ఫ్రెండ్‌ టీ-షర్టు తో పాటు ఆమె వేసుకున్న షూ కూడా చాలా ఖైరిదైనవే. లెదర్‌ను కలిగి ఉన్న ఈ షూస్‌ విలువ 1.37 లక్షలని తెలిపారు. స్పెయిన్‌కు చెందిన ఒక ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్‌ హౌజ్‌ బ్యాలెంసీ నుంచి కొనుగోలు చేశారని స్పష్టం చేశారు. సో జాన్వీ తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో ఏ మాత్రం తగ్గడం లేదని స్పష్టం అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus