రంజాన్ కానుకగా సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధె’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో ఈ సినిమాను ఒకేసారి థియేటర్లతో పాటు ఓటీటీలో రిలీజ్ చేశారు. శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ముందు ట్విట్టర్ లో రాధె, సల్మాన్ ఖాన్ అనే హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అయ్యాయి. కానీ సాయంత్రం అయ్యేసరికి ప్రభుదేవా పేరు ట్రెండ్ అయింది. ఇలా ట్రెండ్ అవుతుందంటే జనాలు ఆయన్ను పొగిడేస్తున్నారనుకుంటే పొరపాటే.
ఎందుకంటే నెటిజన్లు ప్రభుదేవాను దారుణంగా ట్రోల్ చేశారు. దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన సమయంలో తన క్రియేటివిటీతో మంచి హిట్ సినిమాలు తీశారు ప్రభుదేవా. ఆ తరువాత నుండి ఎక్కువగా రీమేక్ సినిమాలు, రొటీన్ మాస్ కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తున్నాడు. ‘పోకిరి’, ‘విక్రమార్కుడు’ లాంటి సినిమాలను హిందీలో రీమేక్ చేస్తే బాగానే ఆడాయి. కానీ తరువాత ప్రభుదేవా తన స్టైల్ లో తీసిన స్ట్రెయిట్ సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. సల్మాన్ ఖాన్ తో చివరిగా ఆయన తీసిన ‘దబాంగ్ 3’ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
అయినప్పటికీ సల్మాన్ మరో ఛాన్స్ ఇచ్చాడు. వెంటనే ‘రాధె’ సినిమాను తెరకెక్కించాడు. కొరియన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందించడంతో కొత్తదనం ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ రొటీన్ మాస్ కాన్సెప్ట్ తో సినిమా తీశాడు. హీరో ఎలివేషన్లు, భారీ యాక్షన్ సీన్లు తప్ప సినిమాలు ఇంకేమీ లేవు. రొటీన్ సన్నివేశాలతో సినిమాను నింపేశాడు. ఎక్కడా కొత్తదనం కనిపించదు. ప్రభుదేవా ఫ్యాన్స్ లో కొందరికి ఈ సినిమా నచ్చినప్పటికీ.. మెజారిటీ ఆడియన్స్ కు ఈ సినిమా రుచించలేదు.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!