వాల్మీకి చిత్రంలో శ్రీదేవి సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్

దివంగత నటీమణి, అతిలోక సుందరిగా ప్రేక్షకులందరూ పిలుచుకొనే శ్రీదేవి మీద అభిమానం ఉండని తెలుగు దర్శకులు ఉండరు. ఆ అభిమానంతోనే మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన తాజా చిత్రమైన “వాల్మీకి” చిత్రంలో కథానాయికగా నటిస్తున్న పూజా హెగ్డే పాత్రకు శ్రీదేవి అనే పేరు పెట్టాడు. అక్కడివారకూ బాగానే ఉంది కానీ.. ఈ సినిమాలో శ్రీదేవి కెరీర్ లో ఒన్నాఫ్ ది మెమరబుల్ సాంగ్ అయిన “ఎల్లువచ్చి గోదారమ్మ” అనే పాటను పూజా హెగ్డేతో రీమిక్స్ చేయించాలని చూస్తున్నాడట. శోభన్ బాబు-శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఆ పాట అప్పట్లో ఒక సెన్సేషన్. చుట్టూ స్టీల్ బిందెల మధ్యలో వెండి ముద్దలా కనిపించిన శ్రీదేవిని చూసి ఆమె అభిమానులు మాత్రమే కాదు.. యావత్ తెలుగు ప్రేక్షకులు మురిసిపోయారు.

ఆ తర్వాత ఆ సాంగ్ హిందీ వెర్షన్ లో ఇటీవల తమన్నాను శ్రీదేవి శైలిలో చూపించారు హిమ్మత్ వాలా అనే సినిమా కోసం. శ్రీదేవి పోలికలు తమన్నాకు ఉండకపోయినా.. శరీరాకృతిపరంగా పర్వాలేదు కాబట్టి ఆమెను చూశారు ప్రేక్షకులు. ఇప్పుడు పూజా హెగ్డేను శ్రీదేవి స్థానంలో చూడడం అనేది కాస్త ఇంపాజిబుల్ అనే చెప్పాలి. హరీష్ శంకర్ ఏదో భీభత్సమైన మ్యాజిక్ చేస్తే తప్పితే.. ఆ పాటలో శ్రీదేవిని పూజా హెగ్డే మరిపించగలగడం అనేది ఇంపాజిబుల్.

ఇకపోతే.. గ్యాంగ్ లీడర్ కోసం ఒకవారం వెనక్కి తగ్గి సెప్టెంబర్ 20న విడుదలవుతున్న “వాల్మీకి” మీద దర్శకుడు హరీష్ శంకర్ కంటే ఎక్కువ నమ్మకం పెట్టుకొన్నాడు టైటిల్ పాత్రధారి వరుణ్ తేజ్. మరి సినిమా రిజల్ట్ ఏమిటవుతుంది అనేది తెలియాలంటే అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus