బిగ్ బాస్ గేమ్ అంటేనే స్ట్రాటజీలు, గేమ్ ప్లాన్ లు బాగా నడుస్తాయి. అందులోనూ ఇప్పుడు నడుస్తోంది 4వ సీజన్ కాబట్టి గేమ్ ప్లాన్స్ పీక్స్ లో ఉంటాయి. ప్రతివారం నామినేషన్స్ అలాగే ఎలిమినేషన్స్ చాలా కామన్. కానీ, ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి సీజన్ 4 లో ఎలిమినేషన్ లో ఎమోషన్స్ చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు, లాస్ట్ టైమ్ అవినాష్ తనకి బిగ్ బాస్ నుంచి బయటకి వస్తే కెరియర్ లేదని, ఒకసారి సూసైట్ కూడా చేస్కోవాలని అనిపించిందని, గతంలో తను చేస్తున్న షో నుంచి బయటకి పంపేశారని చెప్పుకుని బాధపడ్డాడు. అప్పుడు అమ్మరాజశేఖర్ మాస్టర్ అవినాష్ కి ఫుల్ క్లాస్ కూడా పీకాడు. దీన్ని వీకెండ్ లో వచ్చిన నాగార్జున ఎప్రిషియేట్ కూడా చేశాడు.
అయితే, 9వ వారం నాటకీయంగా జరిగిన ఎలిమినేషన్ లో ఆల్ మోస్ట్ ఎలిమినేషన్ అంచులదాకా వెళ్లి వచ్చిన అవినాష్ కి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. దీంతో మోకాళ్లపై పడి మరీ బాగా ఏడ్చాడు. బయటకి వస్తే బతుకు లేదని బాధపడ్డాడు. మరోవైపు అరియానా కూడా నన్ను హౌస్ లో టార్గెట్ చేస్తున్నారని, హౌస్ లో ఉండబుద్ది కావట్లేదని, నేను ఆడపిల్లగా పోరాడాల్సినంత పోరాడు అని కెమెరా ముందుకు వచ్చి ఏడుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి.
బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కెరియర్ ఉంటుందని, దాన్ని చూసే హౌస్ లోకి వచ్చేందుకు అవకాశం ఇస్తారని, మళ్లీ బయటకి వచ్చాక వారి క్రేజ్ ఎక్కడా తగ్గదని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, సూసైడ్ చేస్కుంటానంటూ ఎమోషనల్ గా బ్లాక్ మైయిల్ చేయడం ఏంట్రా బాబూ అంటూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. మీరొక్కరే కష్టాలు ఎదుర్కోరని, చాలామందికి కష్టాలు ఉంటాయని ఎవరి ప్రాబ్లమ్ వారికి పెద్దదిగా కనిపిస్తుందని సలహాలు ఇస్తున్నారు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడున్నవాళ్లు, అలాగే గతంలో వచ్చిన వెళ్లినవాళ్లు కూడా హ్యాపీగానే ఉన్నారని, ఆఫర్స్ ఏమీ లేని వాళ్లు కూడా తర్వాత బాగా సెటిల్ అయ్యారని కూడా చెప్తున్నారు. అంతమాత్రాన ప్రతివారం ఈ ఏడుపుకష్టాలు చెప్తూ పదే పదే నిరుద్యోగపు కష్టాలు చెప్పకు అని, ఎక్కడ ఉన్నా కూడా అందరి కెరియర్ ఒకటే బ్రదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అదీ మేటర్.