Bigg Boss 7 Telugu: సీజన్ – 6 లాగా సీజన్ – 7 కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వబోతోందా ? కారణాలు ఇవే..!

బిగ్ బాస్ సీజన్ 7 చాలా చప్పగా సాగుతోంది. హౌస్ లోకి వచ్చి నాలుగు రోజులు అవుతున్నా కూడా పార్టిసిపెంట్స్ ఇంకా ఆడియన్స్ కి అలవాటు కాలేకపోయారు. అంతేకాదు, బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తున్నా కూడా వాటిపై ఎక్కువగా శ్రద్ధ చూపించడం లేదు. హౌస్ లోకి వచ్చామా ? తిన్నామా ? పడుకున్నామా ? తెల్లారిందా అన్నట్లుగానే ఉంది హౌస్ మేట్స్ పరిస్థితి. సీరియల్ ఆర్టిస్ట్ లు, సీనియర్ ఆర్టిస్ట్ లు ఉన్నా కూడా షో ని రక్తి కట్టించలేకపోతున్నారు.

అందుకే, బిగ్ బాస్ ఏం చేయాలో తెలియక, తానే హౌస్ మేట్స్ పై పంచ్ లు వేస్తూ, తన సెన్సాఫ్యూమర్ ని చూపిస్తూ జోకులు వేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో కాఫీ కోసం లొల్లి చేసిన శివాజీ బిగ్ బాస్ ని ఇంప్రెస్ చేసేందుకే ఈ డ్రామా ఆడాడు. అందుకు బిగ్ బాస్ ఇంప్రెస్ అయ్యి యాక్టివిటీ రూమ్ కి పిలిచి మరీ కాఫీ ఇచ్చాడు. అంతేకాదు, రతిక కూడా స్టెత్ స్కోప్ పట్టుకుని అందరి గుండెల్లో ఏముందో స్వచ్ఛంగా బయటపెట్టే ప్రయత్నం చేసింది.

తనని కూడా యాక్టివిటీ రూమ్ కి పిలిచి టీజ్ చేస్తూ బిగ్ బాస్ స్వయంగా ఎంటర్ టైన్ చేశాడు. అంతేకాదు, మిగతా వాళ్లు అందరూ ఏం చేయాలో తెలియక కూర్చుంటే బిగ్ బాస్ గైడెన్స్ ఇచ్చాడు. ప్రిన్స్ ని ఫ్లట్టింగ్ చేయమన్నాడు. అది చేతకాకపోతే వదిలేయ్ అన్నాడు. ఆ తర్వాత శోభాశెట్టికి ఆ బాధ్యత ఇచ్చాడు. అది కూడా బెడిసి కొట్టింది. ఇక షకీలా జోకర్ మేకప్ వేస్కున్నా కూడా ఎంటర్ టైన్ చేయలేకపోయింది. కన్ఫెషన్ రూమ్ కి పిలిచి కనీసం గాసిప్స్ అయినా చెప్పమని చెప్పాడు.

టేస్టీ తేజ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ ఇదే. అసలు కిరణ్ రాథోడ్ అయితే ఏం చేసిందో తనకే తెలియదు. ప్రియాంక, సందీప్ ఇద్దరూ కూడా వారికి టిక్కెట్ ముందుగానే వచ్చింది కాబట్టి రిలాక్స్ అయిపోయారు. గౌతమ్ – శుభశ్రీ ఏదో ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. థామిని, రతిక, అమర్ దీప్ కలిసి భట్టు – ఛారి స్క్రిప్ట్ స్కిట్ చేశారు కానీ బిగ్ బాస్ కి నచ్చలేదు. దీంతో బిగ్ బాస్ ఈ సీజన్ లో తానే స్వయంగా ఎంటర్ టైన్ చేస్తూ జోకులేస్తూ హౌస్ మేట్స్ లో హుషారు తెప్పించాడు.

ఇలాగే ఇంకో రెండు వారాలు హౌస్ మేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ 6 లాగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ముఖ్యంగా లైవ్ స్ట్రీమింగ్ టెలికాస్ట్ కంటే ముందే అవ్వడం అనేది బిగ్ బాస్ రేటింగ్ ని బాగా దెబ్బకొడుతోంది. అందుకే, అట్టర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. కనీసం వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే పార్టిసిపెంట్స్ అన్నా సరే, బిగ్ బాస్ సీజన్ 7లో ఎంటర్ టైన్ చేస్తారేమో చూడాలి. అదీ మేటర్.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus