పూరి జగన్నాథ్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు.. కారణం అదే..!

ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ‘ఫైటర్'(వర్కింగ్ టైటిల్) అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఛార్మీ, కరణ్ జోహార్ లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల నుండీ పూరి తన మనసులోని భావాలను ఆడియో క్లిప్స్ గా చేసి ‘స్పాటిఫై’ అనే యాప్ లో పెడుతున్నాడు. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.

అయితే ఇటీవల రిజర్వేషన్ కు సంబంధించి తన స్టైల్ లో పూరి చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయనే చెప్పాలి. ఓ వర్గం వారు పూరి కామెంట్స్ పై ఘోరంగా విరుచుకు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే…’రిజర్వేషన్ అనేది కులాన్ని బట్టి ఇవ్వకూడదు. పేదవాడు ఏ కులంలో అయినా ఉండొచ్చు. చెప్పాలంటే అలాంటి వాళ్లకు ఉండాలి. నిజం చెప్పాలి అంటే రిజర్వేషన్ తీసుకోవడం అంటే అడుక్కు తినడమే’… అంటూ చేసిన కామెంట్ ఓ వర్గం వారికి మండేలా చేసింది.

‘హీరోయిన్ల తొడలను నీచాతి నీచంగా చూపించే నువ్వు ఇలాంటి పత్తిత్తు కబుర్లు చెప్తున్నావ్. అంత బాధ్యత ఉన్నవాడివే అయితే.. ‘కులం అనేది తీసేస్తే బాగుంటుంది’ అని చెప్పొచ్చు కదా..! దాని గురించి మాట్లాడవు..! నువ్వు కులాన్ని ఎంకరేజ్ చేస్తావు కానీ.. రిజర్వేషన్లు ఎంకరేజ్ చెయ్యవు.వైట్ కార్డు ఉన్నవాళ్ళకు ఓటు హక్కు తీసెయ్యాలి అంటున్నావు.. అదే వైట్ కార్డు ఉన్నవాళ్లని సినిమాలు కూడా చూడొద్ధు అని చెప్పగలవా’ అంటూ ఘోరంగా విరుచుకు పడుతున్నారు.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus