గురూజీ.. కాస్త కథలు మార్చండి..!

  • February 3, 2020 / 04:14 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలివుడ్ లో దాదాపు రాజమౌళి తర్వాత ఈ దర్శకుడిదే హవా అంతా..! ఈయన్ని అందరూ గురూజీ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇటీవల వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ చిత్రం ‘బాహుబలి 1’ కల్లెక్షన్లనే అధిగమించింది. అయితే అది తెలుగురాష్ట్రాల్లో మాత్రమే అనుకోండి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం కలెక్షన్లు, రికార్డులు సంగతి పక్కన పెడితే.. అసలు ఈ చిత్రం విజయం విషయంలో తివిక్రమ్ కు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరమే లేదనే విమర్శలు కూడా కురుస్తుండడం గమనార్హం.

ఈ మధ్యకాలంలో ఒక్క ‘అరవింద సమేత’ చిత్రాన్ని పక్కన పెడితే అన్ని సినిమాలు ఒకే స్టోరీలైన్ తో గురూజీ లాగించేస్తున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘అత్తారింటికి దారేది’ తో మొదలు ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘అఆ’ ‘అజ్ఞాతవాసి’ ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’.. చిత్రాల కథలన్నీ ఒకేలా ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాగా డబ్బున్న వాళ్ళ ఇల్లు, ఆ ఇంటిలో మనిషుల మధ్య మనస్పర్థలు.. ఫలితంగా ఒకరు ఇంటిలో నుండీ దూరం అవ్వడం .. తరువాత ఆ ఇంటిని వెతుక్కుని వెళ్ళే ప్రయత్నాలు చెయ్యడం’ అదే టెంప్లేట్ తో సినిమాలు చేస్తున్నాడు త్రివిక్రమ్ అనే విమర్శలు కురుస్తున్నాయి. ‘అల వైకుంఠపురములో’ చిత్రం విజయం విషయంలో ఆడియో పెద్ద హిట్ అవ్వడం, సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉండడం.. పైగా ‘గీత ఆర్ట్స్’ రిలీజ్ కాబట్టే ఈ చిత్రం ఇంత పెద్ద విజయాన్ని నమోదు చేసింది. మరి వీటిని గుర్తించి త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో తెరకెక్కించే చిత్రానికైనా సరిచేసుకుంటాడో లేదో చూడాలి.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus