తెలుగు వెర్షన్ రిలీజ్ చేయకపోయినా.. మనవాళ్ళు తగ్గడం లేదుగా..!

‘క్రాక్’ (Krack) ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్స్ తో ఫామ్లో ఉన్నాడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni). ఆ తర్వాత రవితేజతో (Ravi Teja)  మరో సినిమా చేయాలి. ‘మైత్రి మూవీ మేకర్స్’ ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ మార్కెట్ లెక్కల్లో తేడా రావడంతో పూజా కార్యక్రమాలు వద్దే ఆపేశారు నిర్మాతలు. అయితే అదే కథని హిందీలో సన్నీ డియోల్ తో (Sunny Deol) తీస్తున్నారు అనే డిస్కషన్స్ కూడా జరిగాయి. కానీ వాటిని దర్శకుడు గోపీచంద్, నిర్మాతలు తోసిపుచ్చారు.

Jaat

అది వేరే కథ అని సింపుల్ గా చెప్పి.. మాట దాటేశారు. సరే మొత్తానికి ‘జాట్’ (Jaat) రెడీ అయ్యింది. పూర్తిగా సౌత్ ఫ్లేవర్ తో ప్యాకేజీ చేసిన నార్త్ మూవీ ఇది. కథ, కథనం.. బ్యాక్ డ్రాప్ అంతా తెలుగు నేటివిటీతోనే ఉంటుంది. నార్త్ ఆడియన్స్ ఈ మధ్య సౌత్ సినిమాలు బాగా చూస్తున్నారు కాబట్టి.. ఈ కథని నార్త్ హీరోతో తీశారు. సరే హిందీ సినిమాగానే నిన్న అంటే ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. నార్త్ లో బుకింగ్స్ బాగానే ఉన్నాయి.

తొలి రోజు వీక్ డే అయినప్పటికీ రూ.9 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించింది. సో రెండో రోజు నుండి సినిమా గ్రోత్ చూపించే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే సౌత్ జనాలు ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు. థియేటర్లలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కూడా. హీరో ఎలివేషన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి నార్త్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి అని అర్థం చేసుకోవచ్చు.

కాకపోతే ‘జాట్’ ని ఎక్కువగా ట్రోల్ చేస్తుంది మన తెలుగు వాళ్ళే కావడం గమనార్హం. ఇది ఔట్ డేటెడ్ కథ అని, కొత్తదనం ఏమీ లేదని.. ఇలా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. మేకర్స్ తెలుగు వెర్షన్ రిలీజ్ చేయకుండా మంచి పనే చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు వెర్షన్ కనుక రిలీజ్ చేసి ఉంటే.. ఇంకా ఎక్కువగా తెలుగు జనాలు ఈ సినిమాని చూసేవారు. మరింతగా విమర్శించేవారు. అందుకే నిర్మాతలైన మైత్రి వారిని ఈ విషయంలో అభినందించాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus