LEO Movie: లియో పోస్టర్ పై నెటిజన్లు కామెంట్స్ వైరల్..!

  • September 23, 2023 / 01:27 PM IST

పోస్టర్లతోనే చంపేస్తున్నారు లియో మూవీ మేకర్స్. రోజుకో కొత్త పోస్టర్ తో సినిమా ప్రమోషన్లను వినూత్నంగా చేపట్టడంతోపాటు మూవీపై ఆసక్తిని పెంచేస్తున్నారు. తాజాగా గురువారం (సెప్టెంబర్ 21) ఈ మూవీ హిందీ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎంతో ఆవేశంగా కనిపిస్తున్న విజయ్.. విలన్ సంజయ్ దత్ గొంతును కసిగా పట్టుకోవడం కనిపించింది. లియో మూవీ నుంచి బుధవారం (సెప్టెంబర్ 20) కూడా ఓ పోస్టర్ రిలీజైన విషయం తెలిసిందే.

కీప్ కామ్.. ప్రిపేర్ ఫర్ ద బ్యాటిల్ అనే క్యాప్షన్ తో ఆ పోస్టర్ రిలీజైంది. ఇక తాజాగా రిలీజైన పోస్టర్ లోనూ మరో పవర్ ఫుల్ డైలాగ్ ఉంది. “కీప్ కామ్ అండ్ ఫేస్ ద డెవిల్” అనే డైలాగ్ ఈ పోస్టర్ పై ఉంది. ఇందులో సంజయ్ గొంతును విజయ్ పట్టుకోవడం చూడొచ్చు. విజయ్ మరింత ఇంటెన్స్ లుక్ లో అదరగొట్టాడు. ఇప్పటికే లియో మూవీ నుంచి చాలా పోస్టర్లు రిలీజయ్యాయి.

ఈ మధ్యే తెలుగు పోస్టర్ కూడా రిలీజ్ కాగా.. అది రికార్డులు కొల్లగొట్టింది. విజయ్ ఇన్‌స్టాగ్రామ్ లో కేవలం 32 నిమిషాల్లోనే మిలియన్ లైక్స్ సంపాదించిందీ పోస్టర్. ఈ క్రమంలో 33 నిమిషాల్లో మిలియన్ మార్క్ అందుకున్న పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసింది. లియో మూవీ విజయ్ దళపతి, లోకేష్ కనగరాజ్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తోంది.

తమిళంతోపాటు పాన్ ఇండియా లెవల్లో ఇప్పుడు లోకేష్ కనగరాజ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. గతేడాది విక్రమ్ సినిమాతో అతని రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అక్టోబర్ 19న ఈ లియో మూవీ రిలీజ్ కానుంది. అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా (LEO Movie) కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus