Mahesh Babu: అడ్డంగా బుక్కైపోయిన మహేష్.. పరువు మొత్తం పోయిందిగా..!

మహేష్ బాబు నటించే యాడ్స్ కొన్ని అతని ఇమేజ్ కు తగ్గట్టు ఉండవు.. అతని ఇమేజ్ ను తగ్గించే విధంగా ఉంటాయి. డబ్బు కోసం పిన్నీసులు, హెయిర్ పిన్ యాడ్లలో కూడా నటించేస్తారా మహేష్ బాబు అంటూ గతంలోనే చాలా విమర్శలు వచ్చాయి. మహేష్ అభిమానులు కూడా తమ హీరో యాడ్స్ వంటి వాటిలో నటించడం తగ్గిస్తే బాగుణ్ణు అంటూ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. సరే ఇక అసలు విషయానికి వద్దాం.

‘మేజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ స్పందించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘తనకి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం లేదని. ఇప్పటికే చాలా ఆఫర్లు వచ్చినా తిరస్కరించాను అని, బాలీవుడ్ నన్ను భరించలేదని, తెలుగు సినిమాలే బాలీవుడ్ కు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నట్టు మహేష్ చెప్పుకొచ్చాడు. మహేష్ కామెంట్స్ బాగున్నాయి. అతని ఫ్యాన్స్ కూడా గర్వపడేలా ఉన్నాయి. కానీ అతను పాన్ మసాలా బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ బాలీవుడ్ జనాలకి దొరికేసాడు.

పొగాకు ఉత్పత్తుల బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడానికి అల్లు అర్జున్, యష్ వంటి హీరోలు నొ చెప్పారు. టాలీవుడ్ హీరోల్లో చాలా మంది హీరోలకి స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నప్పటికీ దానిని ప్రమోట్ చేయడానికి వారు ఇంట్రెస్ట్ చూపించలేదు. యువతని తప్పుదోవ పట్టించే బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం ఇష్టం లేక వాళ్ళు నొ చెప్పారు. అయితే మహేష్ బాబు ఆ బ్రాండ్ ను కూడా ప్రమోట్ చేయడానికి రంగంలోకి దిగాడు.

b అది కూడా అక్కడి స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి. అందుకే మహేష్ ను హిందీ జనాలు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ‘మహేష్ బాబు మాటల్లో నానార్థాలు చాలా ఉంటాయని అర్ధమైంది’ అంటూ వాళ్ళు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus