Bigg Boss: నాగార్జున యాంకరింగ్ పై ఆడియన్స్ ఫైర్..! ఆదివారం ఎపిసోడ్ లో జరిగింది ఇదే..!

ఉగాది స్పెషల్ ఎపిసోడ్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ స్టేజ్ దద్దరిల్లిపోయింది. బంగార్రాజుగా నాగార్జున ఎంట్రీ ఇవ్వడం, హీరోయిన్స్ డ్యాన్స్ లు, పాటలతో స్టేజ్ హోరెత్తిపోయింది. ముఖ్యంగా రోల్ రైడా ర్యాప్, పూర్ణ డ్యాన్స్ ఎపిసోడ్ లో హైలెట్ అని చెప్పాలి. ఇక హౌస్ మేట్స్ ని పలకరించిన నాగార్జున తొక్కా, తోటకూర గేమ్ అంటూ హౌస్ మేట్స్ కి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే, వాళ్ల గేమ్ లో దోషి ఎవరు నిర్దోషి ఎవరు చెప్తానని తీర్పు కరెక్టా కాదా అనేది కూడా చెప్తానని హౌస్ మేట్స్ కి కిక్ ఇఛ్చారు.

Click Here To Watch NOW

కానీ, అసలు విషయాన్ని వదిలేసి కొసరు విషయాన్ని పట్టుకున్నారు. బిందు మాధవి చేసిన తప్పుని , ఆ వీడియో క్లిప్ ని క్లియర్ గా ఆడియన్స్ కి అలాగే హౌస్ మేట్స్ కి చూపించి క్లారిటీ అడగాల్సింది. ఇది కంప్లీట్ గా నాగార్జున మిస్ చేశారనే చెప్పాలి. అసలు ఏం జరిగిందనేది ఎవరికీ చెప్పలేదు. బిందు మాధవి అఖిల్ ని నువ్వు ఏదీ ఆడా.. అసలు నువ్వు ఏదీ ఆడా అంటూ మాట్లాడింది.

అలాగే, నటరాజ్ మాస్టర్ వాదించిన తీరు , ముమైత్ తీర్పు వీటిపైన మాట్లాడాలి. కానీ, ముమైత్ కి ఫేవర్ గా మాట్లాడారు. అలాగే నటరాజ్ మాస్టర్ ని పొగడ్తలతో ముంచెత్తాడు కింగ్ నాగార్జున. దీంతో బిగ్ బాస్ లవర్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అసలు నాగార్జున ఆ వీడియో క్లిప్ ఎందుకు చూపించలేదంటూ మాట్లాడుతున్నారు. మైండ్ దొబ్బిందని, హోస్ట్ ని మార్చాలని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ విషయంలో బిందుమాధవి తప్పేమీ లేదు.

అయినా కూడా నాగార్జున అఖిల్ అండ్ టీమ్ ని సపోర్ట్ చేయడం అనేది బిగ్ బాస్ వ్యూవర్స్ కి నచ్చలేదు. అంతేకాదు, లాస్ట్ సీజన్ లో ఇలాగే గిల్టీ బోర్డ్ ని సన్నీ మెడలో వేశారు. ఇప్పుడు కూడా గిల్టీ బోర్డ్ ని సరైన పర్సన్ కి వేయలేదు. కావాలనే బిగ్ బాస్ టీమ్ స్ట్రాటజీ ప్లాన్ చేసిందా అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక హౌస్ మేట్స్ మద్యలో ఫన్నీ గేమ్స్ ఆడిస్తూనే ఉగాది సందర్భంగా ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారో చెప్పమని వాళ్లతోనే చెప్పించారు.

హౌస్ మేట్స్ మరోసారి ఒకరినొకరు నిందలు వేసుకుంటూ రుచులని తినిపించుకున్నారు. అత్యంత నాటకీయంగా తేజస్వి ఎలిమినేషన్ జరిగింది. తేజస్వి ఎలిమినేట్ అనగానే హౌస్ మేట్స్ అందరూ షాక్ తిన్నారు. ఇక తేజస్వి వెళ్లిపోతూ నటరాజ్ మాస్టర్ ని కన్సర్న్ చేసి వెళ్లింది. అంతేకాదు, హౌస్ మేట్స్ లో కొందరికి ఛేదు లడ్డూలు, మరికొందరికి తీపి లడ్డూలు తినిపించి వెళ్లింది. అదీ మేటర్.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus