‘సైరా’ తో నిహారిక హిట్టైతే అందుకుంది.. కానీ..!

మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ వంటి సినిమాలు చేసినా ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయింది నిహారిక. మంచి నటిగా గుర్తింపు తెచుకున్నప్పటికీ గ్లామర్ పాత్రలు చేయడానికి ఫ్యామిలీ మెంబెర్స్ ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ అమ్మడు ఎక్కువ ఆఫర్లు దక్కించుకోలేకపోతుందన్న సంగతి అంతరికీ తెలిసిందే. ఇక సినిమాలు వేస్ట్ అని వెబ్ సిరీస్ లు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి రెడీ అయ్యింది నిహారిక.

అయితే ఒక్క హిట్టయినా లేకూండా.. సినిమాలనుండీ తప్పుకోవడమేంటి అనుకుందేమో.. తన పెదనాన్న సినిమా ‘సైరా’ లో ఓ క్యారెక్టర్ చేసే అవకాశం కొట్టేసింది. నిన్న విడుదలైన ‘సైరా’ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్లు రాబడుతుంది. ఇలా నిహారిక అకౌంట్ లో ఓ హిట్ పడింది. కానీ అసలు ఈ సినిమాలో నిహారిక పాత్ర పేరు అంటూ ఏమీ ఉండదు. కనీసం నిహారికకు ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఏదో జనాల మధ్యలో పడేసారు. ఇక క్లయిమాక్స్ ఏదో ఎగురుతూ కత్తులతో యుద్దాలు చేస్తున్నట్టు చూపించారు. ఇక ‘సైరా’ లో ఈమెను చూసిన ప్రతీ ఒక్కరూ రక రకాలుగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ‘సైరా’ లో నిహారిక కంటే ‘నల్ల పులి’ ఎక్కువ కనిపించిందని రకరకాల మీమ్స్ వేస్తున్నారు. అంతేకాదు ‘సైరా’ పై ట్వీట్స్ వేస్తున్న మెగా హీరోలు కూడా నిహారికను ‘మెన్షన్’ చేయకపోవడం గమనార్హం. ఇలా హిట్టొచ్చినా కానీ నవ్వుల పాలైంది నిహారిక.

‘సైరా’ సినిమా రివ్యూ & రేటింగ్!
వార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus