Prabhas: ‘ఆదిపురుష్’ కి హిట్ టాక్ వచ్చినా.. ఆ ట్రోల్స్ మాత్రం తప్పట్లేదు..!

గతంలో శ్రీరాముని పాత్రలో.. చాలా మంది హీరోలు కనిపించారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్,శోభన్ బాబు, బాలకృష్ణ, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. అయితే ప్రభాస్ కూడా శ్రీరాముని పాత్రలో కనిపించాడు. అది కూడా ‘ఆదిపురుష్’ సినిమాలో..! వాస్తవానికి గతంలో శ్రీరాముని పాత్రలో కనిపించిన ఏ హీరో కూడా మీసాలతో కనిపించలేదు. అయితే ప్రభాస్ మాత్రం ఒత్తైన మీసాలతో కనిపించాడు. అలాగే ‘బాహుబలి'(సిరీస్) లో కంటే ఎక్కువ లావుగా కనిపించాడు.

టీజర్ రిలీజ్ అయినప్పుడే ప్రభాస్ (Prabhas) లుక్స్ పై దారుణంగా ట్రోల్స్ మొదలయ్యాయి. అయినా ఆ టీజర్ రికార్డులు సృష్టించింది. ట్రైలర్స్ తో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పోయింది. ‘ఆదిపురుష్’ పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే అభిమానులు సైతం ప్రభాస్ లుక్స్ ను జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం పై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘ఫుల్లుగా తాగేసి..

సీన్ సీన్ కి సిగరెట్లు కాలుస్తూ చేస్తే ఇలాగే ఉంటుంది లుక్ అండ్ పెర్ఫార్మన్స్’ అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ‘గతంలో శ్రీరాముని పాత్రలో కనిపించిన హీరోలు ఆ పాత్ర కోసం ఎంతో శ్రద్ధ వహించేవారు. ఆ పాత్ర చేస్తున్నన్ని రోజులు శాఖాహారం మాత్రమే తీసుకునేవారు. మాంసాహారం జోలికి పోయేవారు కాదు.

అలాగే పడుకుంటే నేలపైనే పడుకునేవారు. ఇలా చాలా నియమాలు పాటించేవారు. కానీ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ .. శ్రీరాముని లుక్ గురించి కొంత కూడా శ్రద్ధ పెట్టలేదు’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. సీనియర్ విశ్లేషకులు కూడా ఇది నిజమే అంటున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus