చరణ్ ను ‘రా’ అన్నందుకు తమన్నా పై ట్రోలింగ్?

ఓ పక్క ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తూనే మరోపక్క ‘సైరా’ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని కూడా నిర్మించి దేశమంతా పాపులర్ అయ్యాడు మెగాపవర్ స్టార్ రాంచరణ్. ఇది పక్కన పెడితే రాంచరణ్ కు ఇండస్ట్రీ లో అందరూ ఫ్రెండ్సే..! మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, రానా, శర్వానంద్ వంటి హీరోలతో చరణ్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అలా అని టాలీవుడ్ తో సరిపెట్టేసుకోలేదు… బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, మలయాళంలో దుల్కర్ సల్మాన్ వంటి వారితో కూడా మంచి ‘ఫ్రెండ్ షిప్’ కొనసాగిస్తున్నాడు చరణ్. హీరోయిన్లలో కూడా కియారా అద్వానీ, కాజల్ వంటి వారు చరణ్ కు బెస్ట్ ఫ్రెండ్స్. ఇక ఈ లిస్ట్ లో తమన్నా కూడా ఉందని ఇటీవల జరిగిన ‘సైరా థాంక్స్ గివింగ్’ మీటింగ్ లో స్పష్టమయింది.

ఈ వేడుకలో తమన్నా ‘చరణ్.. నువ్వు కో యాక్టర్ గా బెటర్ నా.. ప్రొడ్యూసర్ గా బెటర్ నా ఏం చెప్పాలి రా..!’ అని అందంతో అందరూ షాక్ అయ్యారు. ఇక చరణ్ కూడా మాట్లాడుతున్నప్పుడు… తమన్నా గురించి మాట్లాడబోయి పొరపాటుగా ‘మా నయనతార’ అన్నాడు. దీనికి తమన్నా ఆగకుండా నవ్వుతూనే ఉండడం చూసిన చరణ్ ‘నువ్వు నవ్వడం ఆపేస్తే.. మాట్లాడతా’ అని సరదాగా అన్నాడు. దీనికి చరణ్ ను పక్కనపెట్టి చాలా మంది నెటిజన్లు తమన్నాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘మా చరణ్ ను రా అంటావా’ ‘నీ ఫ్రెండ్ షిప్ ఏమైనా ఉంటే అది ప్రైవేట్ గా చూపించుకో.. ఇలా పబ్లిక్ గా రా నాకు’… అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా సెలబ్రిటీల ‘ఫ్రెండ్ షిప్’ గురించి వారికి సలహాలు ఇవ్వడం మరీ ఓవర్ అనిపిస్తుంది కదూ..!

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus