Liger Movie: ఆ రెండు సీన్లు చాలా దారుణంగా ఉన్నాయంటూ ఫ్యాన్సే ఫీలవుతున్నారు..!

  • August 27, 2022 / 01:42 PM IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో హీరో కావడంతో ఈ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ దగ్గర్నుండి భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన పాటలు,టీజర్, ట్రైలర్ వంటివి అంచనాలను రెట్టింపు చేశాయనే చెప్పాలి. అయితే ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చింది.

సినిమా ఏమాత్రం రియాలిటీకి దగ్గరగా లేదు అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు.వాళ్ళు మాత్రమే విజయ్ దేవరకొండ అభిమానులు కూడా దర్శకుడు పూరి జగన్నాథ్ పై మండి పడుతున్నారు. అసలు సినిమాలో ఏమాత్రం తెలుగు నేటివిటీకి దగ్గరగా లేదని. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి మళ్ళీ తెలుగులో డబ్బింగ్ ఇచ్చినట్టు ఉందని విమర్శిస్తున్నారు. అయితే హిందీలో మాత్రం ఈ మూవీ స్లోగా పికప్ అయ్యేలా కనిపిస్తుంది. అలా అని అక్కడ కూడా రివ్యూలు గొప్పగా రాలేదు.

ఏది ఎలా ఈ చిత్రంలో రెండు సన్నివేశాలు మాత్రం ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేశాయట. రియాలిటీకి ఏమాత్రం అవి దగ్గరగా లేవని ప్రేక్షకులతో పాటు విజయ్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఇంతకీ ఆ సీన్లు ఏంటి అంటే.. తల్లి పాత్ర పోషించిన రమ్యకృష్ణకి..హీరో విజయ్ దేవరకొండ కి మధ్య ఓ ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఈ సీన్ అయిన వెంటనే హీరోకి, హీరోయిన్ కు మధ్య ఫాస్ట్ బీట్ సాంగ్ వస్తుంది. అలాగే బాక్సింగ్ కాంపిటీషన్ కోసం హీరో లాస్ వేగాస్ కి వెళ్తాడు.

అక్కడ పోటీదారుడు హీరోకి ఓ పంచ్ ఇస్తే.. హీరో కింద పడిపోతాడు. హీరో తల్లి దీనిని ముంబైలో ఉండి టీవీలో చూస్తూ ఉంటుంది. ఆమె టీవీ ముందు అరుస్తూ లే అని పలకగానే లాస్ వేగాస్ లో ఉన్న హీరో లేచి ఫైట్ చేస్తాడు. ఇలాంటి సన్నివేశాలు ఓ 30 ఏళ్ళ క్రితం చూసినట్టు ఉన్నాయని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus