బయోపిక్ లో నటిస్తున్నందుకే విజయ్ సేతుపతిని ఏకిపారేస్తున్నారు..!

విజయ్ సేతుపతి ప్రస్తుతం తమిళ్ లో స్టార్ హీరో రేంజ్లో దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభంలో సైడ్ క్యారెక్టర్లు చేసిన విజయ్.. ఆ తరువాత మంచి కథా బలం ఉన్న చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ‘ఘట్టం ఏదైనా.. పాత్ర ఏదైనా.. నేను రెడీ’ అని ‘జై లవ కుశ’ లో ఎన్టీఆర్ చెప్పినట్టు.. తనకు నచ్చితే ఎలాంటి పాత్రను చెయ్యడానికైనా ముందుంటాడు విజయ్. తను ఓ స్టార్ హీరో అయ్యుండి కూడా రజినీ కాంత్, చిరంజీవి వంటి హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసాడు.

అయితే తాజాగా అతను ప్రముఖ శ్రీలంక క్రికెటర్‍ అయిన ముత్తయ్య మురళీధరన్‍ బయోపిక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘800’ అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి విజయ్‍ సేతుపతి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.ఎం.ఎస్.శ్రీపతి ఈ చిత్రానికి దర్శకుడు. టెస్ట్ క్రికెట్లో 800 వికెట్లు తీసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసాడు మురళీధరన్‍. అతనిది కూడా ఎంతో ఎమోషనల్ జర్నీ అని చాలా మంది చెబుతుంటారు.

ఇదిలా ఉండగా.. తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ ఫస్ట్ లుక్ పై మండిపడుతున్నారు. శ్రీలంక జెర్సీ ధరించి, శ్రీలంక పతాకాలను మోస్తున్న విజయ్ సేతుపతిని చూసి వారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అందుకే ‘తమిళుడవై ఉండి… ఓ శ్రీలంక దేశీయుడి జీవిత కథలో నటించడానికి సిగ్గు లేదా’ అంటూ విజయ్‍ ను విమర్శిస్తున్నారు.ఫస్ట్ లుక్ కే రియాక్షన్ ఇలా ఉంటే.. ఇక సినిమా విడుదలయ్యాక విజయ్ సేతుపతిని ఏ రేంజ్లో ఆడుకుంటారో..!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus