‘బాహుబలి’ (సిరీస్) తో ప్రభాస్ ఇమేజ్ ఓ రేంజ్లో పెరిగింది. ఆ చిత్రం తరువాత వచ్చిన ‘సాహో’ చిత్రం ప్లాప్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ.. ప్రభాస్ క్రేజ్ వల్ల బాగానే కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 430కోట్ల పైనే గ్రాస్ ను కలెక్ట్ చేసింది. జపాన్ వంటి దేశంలో ‘సాహో’ ని లాక్ డౌన్ తరువాత విడుదల చేసినప్పటికీ.. అక్కడ కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది.
ఎలా చూసుకున్నా ‘సాహో’ ప్రభాస్ ఇమేజ్ ను ఏమాత్రం డ్యామేజ్ చెయ్యలేదు. కానీ బుల్లితెర పై మాత్రం ‘సాహో’ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ‘సాహో’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్… అక్టోబర్ 18న సాయంత్రం 4:30 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యింది. దానికి ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్లో చేశారు నిర్మాతలు. దీంతో టి.ఆర్.పి రేటింగ్ అదిరిపోతుందని అంతా భావించారు. కానీ ‘సాహో’ కేవలం 5.8 టీ.ఆర్పీ రేటింగ్ ను మాత్రమే నమోదు చేసింది.
దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఇదే సమయానికి ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ నటించిన ‘గుణ 369’ ను ఈటీవీ లో టెలికాస్ట్ అవ్వగా.. దానికి 5.9 టి.ఆర్.పి రేటింగ్ నమోదు కావడం విశేషం. ‘సాహో’ చిత్రం శాటిలైట్ రైట్స్ ను ఏకంగా 20కోట్లకు కొనుగోలు చేశారు. ఇంత తక్కువ టి.ఆర్.పి తో వాళ్ళు సేఫ్ అవ్వడం కష్టమనే చెప్పాలి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?