బాలీవుడ్, శాండల్ వుడ్ లలో డ్రగ్స్ కేసులు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబి) విచారణలు ముమ్మరం చేయడం అందులో కీలక ఆధారాలను సేకరించడం సంజనా గల్రాని వంటి హీరోయిన్లను అరెస్ట్ చేయడం వంటివి చేసింది. ఇంకా కొంతమంది సినీ తారలు ఈ కేసులో నిందితులుగా ఎన్సీబి తేల్చింది. బెంగుళూర్ పోలీసులు కూడా వీరికి సహకరించడంతో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ప్రూవ్ చేసింది.
అయితే వాళ్ళు ఎవరు అనే విషయాలను మాత్రం లీక్ చేయలేదు. ఇక ఈ డ్రగ్స్ కేసుల వ్యవహారం టాలీవుడ్ కు కూడా అతీతం కాదని ప్రూవ్ అయ్యింది.2017 వ సంవత్సరంలో టాలీవుడ్ కు చెందిన చాలా మంది సినీ తారలను ఈడి విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఎక్సైజ్ శాఖ హైకోర్టులో మెమో దాఖలు చేయగా…కోర్టు ఏ వివరాలు అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులను అడిగారో అవి అందలేదనే వాదన జరిగింది.
డిజిటల్ రికార్డ్స్, ఎఫ్ఎస్ఎల్,కాల్ డేటా, నివేదికలను ఈడీకి అందజేసినట్లుగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది.అయితే ఈడి కోర్టుకి కాల్ డేటా లు సబ్మిట్ చేయలేదు.ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ విచారణకి సరైన విధంగా సహకరించడం లేదని హైకోర్టులో వివరణ ఇచ్చింది ఈడి.దీంతో ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది హైకోర్టు. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి టాలీవుడ్ ఇప్పటివరకు…
ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటాను పరిశీలించి మళ్ళీ సినీ ప్రముఖులను విచారించడానికి ఈడి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ ల్యాండరింగ్ వంటి విషయాల పై ఈడి మరోసారి ఇన్వెస్టిగేషన్ జరపనుందని స్పష్టమవుతుంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?