2023 సంక్రాంతి పండుగ కానుకగా ఏకంగా 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలలో ప్రధానంగా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్ల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతుండగా ఫస్ట్ వీకెండ్ తర్వాత హిట్ టాక్ వచ్చిన సినిమాలకు అనుగుణంగా ఎగ్జిబిటర్లు థియేటర్ల విషయంలో మార్పులు చేస్తారని దిల్ రాజు వెల్లడించారు. ఇందుకు సంబంధించి అగ్రిమెంట్లు ఉన్నా వాటిని పట్టించుకోరు అని దిల్ రాజు అన్నారు.
దిల్ రాజు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి థియేటర్ల లెక్క మరో వారం రోజుల్లో తేలిపోనుంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు దాదాపుగా సమానంగా థియేటర్లు దక్కనున్నాయి. మైత్రీ నిర్మాతలకు శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారానే భారీ మొత్తంలో ఆదాయం చేకూరింది. మైత్రీ నిర్మాతలు ఈ రెండు సినిమాలతో కచ్చితంగా సక్సెస్ లను అందుకుంటామనే నమ్మకంతో ఉన్నారు. ఈ రెండు సినిమాల కోసం మాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకుని మైత్రీ నిర్మాతలకు మరింత ఎక్కువ స్థాయిలో లాభాలను అందిస్తాయేమో చూడాలి. బాలయ్య, చిరంజీవి తమ సినిమాల ఫలితాలపై కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చిరంజీవి, బాలయ్యలకు ఈ రెండు సినిమాలు సక్సెస్ కావడం కీలకమనే సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని, బాబీ ఈ సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలు వాళ్లకు సక్సెస్ ను అందిస్తాయో లేదో చూడాల్సి ఉంది.
2023 సంక్రాంతి పోటీ మామూలుగా ఉండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతి సినిమాలపై థియేటర్ల ఓనర్లు, బయ్యర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలు వాళ్ల ఆశలను నెరవేర్చి 2023 సంవత్సరంలో హిట్ సినిమాలుగా నిలుస్తాయేమో చూడాలి.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?