Salaar2: సలార్2 మూవీలో ఆ హీరో నిజంగానే నటిస్తారా.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ అనధికారికంగా వాయిదా పడటంతో తారక్ సినిమాల ప్లాన్స్ అన్నీ పూర్తిస్థాయిలో మారిపోయాయి. వార్2, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ, దేవర2 సినిమాలలో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలీదు. ప్రశాంత్ నీల్ సైతం సలార్2 పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఎన్టీఆర్ సినిమాపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. సలార్1 మూవీ నెట్ ఫ్లిక్స్ లో అంచనాలకు మించి వ్యూస్ సొంతం చేసుకుంటుండగా సలార్2 సినిమాలో గోపీచంద్ నటిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులు కావడంతో ఈ కాంబినేషన్ అదుర్స్ అనేలా ఉంటుందని నెటిజన్లు సైతం ఫీలవుతున్నారు. సలార్2 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. సలార్1 సినిమా ప్రేక్షకులకు ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. సలార్2 సినిమాతో ఆ ప్రశ్నలకు సులువుగానే సమాధానం దొరికే అవకాశం అయితే ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్2 సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉంటాయని తెలుస్తోంది.

సలార్2 (Salaar2) మూవీలో శృతిహాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని సమాచారం అందుతోంది. సలార్2 సినిమాలో కథనంలోని ట్విస్టులు ఆకట్టుకునేలా ఉండనున్నాయని తెలుస్తోంది. గోపీచంద్ సలార్2 సినిమాలో నటిస్తే మాత్రం సలార్2 సినిమాకు మరింత ఎక్కువ మొత్తం బిజినెస్ జరిగే అవకాశం ఉంది. గోపీచంద్ త్వరలో భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శివరాత్రి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని గోపీచంద్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus