‘ప్రభాస్ 20’ నుండీ షాకింగ్ అప్డేట్..!

2018వ సంవత్సరం అక్టోబర్ నెలలో షూటింగ్ మొదలుపెట్టుకున్న ‘ప్రభాస్ 20’ అప్డేట్.. ఇంతకాలానికి ఇచ్చారు నిర్మాతలు. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థలు కలిసి ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అదేంటో కానీ.. ‘బాహుబలి’ (సిరీస్) తరువాత ‘సాహో’ అప్డేట్స్ విడుదలైనప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉన్న ఆనందం.. ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు..

ఆ తరువాత… లేదనే చెప్పాలి. ఫస్ట్ లుక్ మరీ నార్మల్ గా ఉండడం.. మళ్ళీ కాపీ ఆరోపణలు కూడా ఎదుర్కోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డల్ అయ్యారని స్పష్టమవుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ‘రాధే శ్యామ్’ క్లైమాక్స్ బరువైన ఎమోషన్స్ తో ఉండేలా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ డిజైన్ చేశాడట. ఘాడ ప్రేమికుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, ప్రేక్షకుల చేత కంట నీరు పెట్టించడం ఖాయమని తెలుస్తుంది.Prabhas20 first look, Radhe Shyam becomes a talking point1

 

అయితే అంత స్యాడ్ క్లైమాక్స్ ను మన ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అన్నది పెద్ద ప్రశ్న? అసలే పెరియాడికల్ డ్రామా..ఏమైనా ట్రాజెడీ కనుక దర్శకుడు మిక్స్ చేశాడంటే… ఫలితం తారు మారు అయ్యే ప్రమాదం ఉంది. అందులోనూ ప్రభాస్ సినిమా అంటే యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అవి లేకపోగా ఇలాంటి ఎమోషనల్ సీన్స్ పెడితే.. కష్టమేనేమో..!

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus