అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ అయ్యాడు. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. నిన్నటి వరకు ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు బన్నీ. ఢిల్లీ వెళ్లి అక్కడ అభిమానులని కలిసి వచ్చాడు. ఇంతలో ఇలా జరుగుతుంది అని ఎవ్వరూ అనుకోలేదు. మరోపక్క నిన్న మొన్నటి వరకు వార్తల్లో నిలిచింది మంచు ఫ్యామిలీ.
అల్లు అర్జున్ అరెస్ట్ తో ఆ టాపిక్ మొత్తం సైడ్ ట్రాక్ అయిపోయింది. మంచు మనోజ్ (Manchu Manoj), అతని తండ్రి మోహన్ బాబు (Mohan Babu)..ల మధ్య ఆస్తి తగాదాలు జరిగాయి. ఆ గొడవలు రోడ్డు కెక్కడం.. మోహన్ బాబు, మనోజ్..లు ఒకరిపై మరొకరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది. అటు తర్వాత జల్ పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లడం, అక్కడే వెయిట్ చేస్తున్న మీడియా.. మనోజ్ రాకతో గేట్లు తోసుకుని లోపలికి వెళ్లడం జరిగింది.
ఆ టైంలో మోహన్ బాబుని ఓ రిపోర్టర్..’చెప్పండి సార్..’ అంటూ మైక్ పెట్టడం ఆ తర్వాత ‘ఏం చెప్పాలి రా’ అంటూ దుర్భాషలాడి మైక్ లాక్కుని అతని నెత్తిపై కొట్టడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మీడియాపై దాడి చేసిన కారణంతో మోహన్ బాబుపై పోలీస్ కేసు ఫైల్ అయ్యింది. దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకున్నారు.
కానీ హైకోర్టు మోహన్ బాబుకు బెయిల్ నిరాకరించింది. దీంతో ఏ నిమిషానికైనా మోహన్ బాబుని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రానికి మోహన్ బాబుని పోలీసులు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇటీవల ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం వల్ల.. మోహన్ బాబుకి కలిసి వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఫైనల్ గా ఏమవుతుందో..!