Bigg Boss Telugu OTT: ముమైత్ కావాలనే అలా చేస్తోంది.. శ్రీరాపాక వ్యాఖ్యలు!

బుల్లితెరపై ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఓటీటీ వెర్షన్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. టీవీలో గంటపాటు టెలికాస్ట్ చేసే ఈ షోని ఇప్పుడు ఓటీటీలో 24 గంటలు టెలికాస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ షో. ఈసారి టీవీలో చూసే ఛాన్స్ ఉండదు. కేవలం హాట్ స్టార్ లో మాత్రమే చూసే అవకాశాన్ని కల్పించారు. అప్పుడే హౌస్ లో మొదటి నామినేషన్స్ కూడా జరిగిపోయాయి.

ఈ నామినేషన్స్ తరువాత కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్ధామ్ పెరిగాయి. ఈ క్రమంలో ముమైత్ ఖాన్ వలన నటి శ్రీరాపాక బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆమెతోటి కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ.. మూడేళ్లక్రితం ఓ ఇంటర్వ్యూలో ముమైత్ ఖాన్ తన చేయి విరగ్గొట్టిందని.. అప్పుడు తన చేయి వాచిపోయింది చెప్పింది. ఆ సమయంలో ఆర్జే చైతు, కాజల్ అక్కడే ఉన్నారని.. చేయి విరిగినట్లు రిపోర్టులు రావడంతో వాళ్లు తనవైపు నిలబడ్డారని తెలిపింది.

అయినా సరే ఆ విషయాన్ని తను అక్కడితోనే వదిలేశానని.. కానీ ముమైత్ ఇంకా దాన్నే మనసులో పెట్టుకొని.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక తనతో అదోలా మాట్లాడుతుందని చెప్పుకొచ్చింది. తనే స్వయంగా ఆమె దగ్గరకి వెళ్లినా కూడా సరిగ్గా మాట్లాడడం లేదని.. పైగా తనను లయర్(అబద్ధాలకోరు) అనేసిందని బాధపడింది. తన శరీరానికి గాయం చేసినా.. పట్టించుకోలేదు కానీ.. ఆమె మాత్రం అదే విషయాన్ని పట్టుకొని వేలాడుతూ తనను అంత మాట అనేసిందని తెలిపింది.

చీటింగ్, లయర్ అనేవి తనకు నచ్చని పదాలని.. ఆ మాట భరించలేకపోతున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఎమోషన్ కి కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసింది శ్రీరాపాక. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ ఆమెని ఓదార్చారు. మరి నిజంగానే ముమైత్ గతంలో జరిగిన విషయాలను మనసులో పెట్టుకొని అలా ప్రవర్తిస్తుందా..? నెక్స్ట్ గేమ్ లో వీరిద్దరి మధ్య దూరం పెరుగుతుందో.. తగ్గుతుందో చూడాలి!

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus