స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సినిమాల ద్వారా పాపులర్ అయిన శ్రేయా ఘోషల్ తెలుగులో కూడా కొన్ని పాటలు పాడటంతో పాటు ఆ పాటల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. శ్రేయా ఘోషల్ గాత్రానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎలాంటి పాటకైనా ఆమె పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారని చాలామంది అభిమానులు భావిస్తారు. ఒక్క పాటకు శ్రేయా ఘోషల్ పారితోషికం 25 లక్షల రూపాయల రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.
మన దేశంలో ఈ స్థాయిలో పారితోషికం తీసుకునే సింగర్లు చాలా తక్కువమంది ఉన్నారు. శ్రేయా ఘోషల్ పాట పాడితే ఆడియో రైట్స్ సైతం ఎక్కువ మొత్తానికి అమ్ముడవుతాయి. చిన్న వయస్సులోనే శ్రేయా ఘోషల్ సింగర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు. ఈ నెల 12వ తేదీన ఆమె పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. 1998 సంవత్సరం నుంచి ఆమె సింగర్ గా యాక్టివ్ గా ఉన్నారు.
ఎంతోమంది సింగర్లు ప్రతి సంవత్సరం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నా వాళ్లు శ్రేయా ఘోషల్ కు పోటీ ఇవ్వలేకపోతున్నారు. 15కు పైగా భాషల్లో శ్రేయా ఘోషల్ పాటలు పాడారు. బాలీవుడ్ మూవీ దేవదాస్ తో శ్రేయా ఘోషల్ కెరీర్ మొదలైంది. శ్రేయా ఘోషల్ ప్రతిభకు ఎన్నో అవార్డులు వచ్చాయి. పలు టీవీ రియాలిటీ షోలకు శ్రేయా ఘోషల్ జడ్జిగా పని చేశారు. శ్రేయా ఘోషల్ టాప్ 100 ఫోర్బ్స్ జాబితాలో 5 సార్లు స్థానం సంపాదించుకున్నారు.
మరికొన్ని సంవత్సరాల పాటు శ్రేయా ఘోషల్ కెరీర్ పరంగా మరింత బిజీగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. శ్రేయా ఘోషల్ స్థాయిలో పేరు సంపాదించుకోవడం మరో సింగర్ కు సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శ్రేయా ఘోషల్ తన సింగింగ్ టాలెంట్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.