‘బిగ్ బాస్ సీజన్ 6′ ఇటీవల ముగిసింది. ఫినాలే ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా జరిగింది.’బిగ్ బాస్’ టైటిల్ విన్నర్ పోరులో భాగంగా ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎపిసోడ్ లో అనూహ్యంగా సింగర్ రేవంత్ విన్నర్ గా నిలిచాడు. రన్నరప్ గా శ్రీహాన్ నిలిచాడు. విచిత్రం ఏంటి అంటే .. శ్రీహాన్ రన్నరప్ అయినప్పటికీ విజేతగా నిలిచిన రేవంత్ కంటే ఎక్కువ ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.టైటిల్ విన్నర్ కు దక్కాల్సింది రూ. 50 లక్షల ప్రైజ్ మనీ అయితే..
రూ. 40 లక్షల ప్రైజ్ మనీతో శ్రీహాన్ వెనుదిరిగాడు. దీంతో రేవంత్ విన్నర్ గా నిలవడం జరిగింది. అయితే ఫైనల్ గా శ్రీహాన్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి కానీ నమ్మకం లేక అతను ఇంకో రూ.10 లక్షలు ప్రైజ్ మనీ పోగొట్టుకున్నాడు అని నాగార్జున రివీల్ చేశాడు. ‘ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు చాలా కాస్ట్ లీ గా ఉంటాయని శ్రీహాన్’ ద్వారా మరోసారి ప్రూవ్ అయ్యింది. సరే ఇంతకీ బిగ్ బాస్ ద్వారా శ్రీహాన్ గెలుచుకున్న అమౌంట్ ఎంత? అనే డౌట్ అందరిలోనూ ఉంది.
శ్రీహాన్ హౌస్ లో 15 వారాలు కొనసాగాడు కాబట్టి.. ఇతని పారితోషికం కూడా ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. శ్రీహాన్ పారితోషికం వచ్చేసి ఒక్కో వారానికి ఒక్కో లక్ష అని సమాచారం. ఆ రకంగా 15 వారాలకు 15 లక్షలు అన్న మాట. అంటే ప్రైజ్ మనీ రూ.40 లక్షలతో పాటు రూ. 15 లక్షల పారితోషికం కూడా యాడ్ అవుతుంది అన్న మాట. అంతేకాకుండా రన్నరప్ గా నిలిచిన వారికి కూడా ఇంకొంత అమౌంట్ ప్రైజ్ మనీగా వస్తుంది.
సో మొత్తంగా ఇతను రూ.65 లక్షల వరకు గెలుచుకున్నట్లు స్పష్టమవుతుంది. అయితే శ్రీహాన్ గేమ్ ను ఇష్టపడిన వాళ్ళు మాత్రం.. విన్నర్ అయ్యి భారీగా అమౌంట్ గెలుచుకోవాల్సిన వాడు ఇలా రన్నరప్ అమౌంట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అంటూ బాధపడుతున్నారు.