పెళ్ళై, బార్సిలోనాలోనే సెటిల్ అయినా సినిమాలే ముఖ్యం: శ్రీయ

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్.. ఇలా అందరు సీనియర్ & జూనియర్ మరియు కొత్త హీరోలతో నటించిన అతికొద్దిమంది హీరోయిన్లలో శ్రీయ ఒకరు. కెరీర్ అయిపోయిందని అందరూ అనుకున్న ప్రతిసారి ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించి “నా పని ఇంకా అయిపోలేదు” అని ప్రూవ్ చేస్తూనే ఉంది. పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తుందేమో అనుకున్నారు జనాలు.

కానీ.. పెళ్లి అయితే సినిమాలు మానేయాలా? అని రివర్స్ లో క్వశ్చన్ చేస్తూ హిందీ, కన్నడ సినిమాలు సైన్ చేసింది శ్రీయ. పెళ్లయ్యాక బార్సీలోనాలో సెటిల్ అయ్యావ్ కదా నిన్ను అప్రోచ్ అవ్వడం ఎలా అని అడుగుతున్న ఫిలిమ్ మేకర్స్ కి.. “నాతో సినిమా తీయాలి అంటే మీరు బార్సీలోనా రావాల్సిన అవసరం లేదు.. ముంబై వచ్చినా సరిపోతుంది. సినిమా కోసం నేను ఎప్పుడు ఎవైలబుల్ గానే ఉంటాను” అని చెప్పుకొచ్చింది శ్రీయ. ఈ అమ్మడిని చూస్తుంటే.. మరో 10 ఏళ్ల తర్వాత కూడా ఇండస్ట్రీకి బై చెప్పేలా లేదు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus