కమర్షియల్ సినిమాలో ఐటెమ్ సాంగ్ అనేది కామన్ అయిపోయింది. దీని కోసం తొలినాళ్లలో ఎవరో ఒకరు హీరోయిన్‌ను తీసుకునేవారు. తర్వాతర్వాత స్టార్ హీరోయిన్లనే ఎంచుకుంటూ వస్తున్నారు. గత కొంతకాలంగా ఈ స్టైల్‌నే చూస్తూ వస్తున్నాం. అయితే సినిమా కథ విషయంలో ఓల్డ్ స్టయిల్‌ను తీసుకున్న కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraj) .. ఇప్పుడు ఐటెమ్ సాంగ్ విషయంలోనూ అదే తరహాలో ఆలోచిస్తున్నారట. సూర్య (Suriya) హీరోగా, పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా కార్తిక్ సుబ్బరాజు ఓ సినిమా చేస్తున్నారు.
అదే ‘రెట్రో’(Retro) . ఇటీవల టీజర్‌తో ఆ సినిమా కాస్త అంచనాలను పెంచుకుంది. ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ఉందట. దానికి సీనియర్ హీరోయిన్ శ్రియను (Shriya Saran) తీసుకుంటున్నారని సమాచారం. మామూలుగా అయితే ఇది నార్మల్ విషయమే. అయితే శ్రియ వయసే ఇక్కడ కీలకంగా మారింది. శ్రియ వయసు ఇప్పుడు 42 ఏళ్లు కావడం గమనార్హం. మామూలుగా అయితే ఈ విషయం కీలకమే. కానీ శ్రియ గురించి తెలిసినవాళ్లకు ఇది పెద్ద విషయం అనిపించదు.
ఎందుకంటే ఇంత వయసు వచ్చినా నేటి తరం హీరోయిన్లకు పోటీగా ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తోంది. ఈ ఆలోచన, రెట్రో లుక్ కోసం శ్రియను ఐటెమ్ సాంగ్ కోసం తీసుకోవాలని కార్తిక్ సుబ్బరాజు అనుకుంటున్నారని అంటున్నారు. ఇక ‘రెట్రో’ సంగతి చూస్తే ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ‘కంగువ’ (Kanguva) సినిమ ఫలితం దారుణంగా తేడా కొట్టినా ‘రెట్రో’ మీద అభిమానులు నమ్మకం పెట్టుకుంటున్నారు. మే 1న సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం అనౌన్స్ చేసింది.
గ్యాంగ్‌స్టర్‌గా ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తాడు. ఇక కార్తిక్ సుబ్బరాజ్ విషయానికి వస్తే ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’తో (Jigarthanda DoubleX) రీసెంట్‌గా వచ్చి ఇబ్బందికర ఫలితం అందుకున్నారు. ఇక వరుస పరాజయాల తర్వాత పూజా హెగ్డే ఈ సినిమాతో దాదాపు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. కాబట్టి ‘రెట్రో’ సినిమా ఇటు హీరోకు, హీరోయిన్‌కు, దర్శకుడికి చాలా కీలకం. చూద్దాం మరి ‘రెట్రో’ ఏమవుతుందో?