విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా ‘లైలా’ (Laila) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘షైన్ స్క్రీన్స్’ సంస్థపై సాహు గారపాటి (Sahu Garapati) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ తో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేశారు. అందులో భాగంగా విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా వదిలారు ‘లైలా’ ట్రైలర్ విషయానికి వస్తే..
ఇది నిమిషాల నిడివి 2 నిమిషాల 28 సెకన్లు నిడివి కలిగి ఉంది. టీజర్లో హీరో విశ్వక్ సేన్ సోనూ అనే లేడీ బ్యూటీ పార్లర్ నడుపుకునే అబ్బాయిగా కనిపించాడు. కానీ అతను ఎందుకు లేడీ గెటప్ వేయాల్సి వచ్చింది అనే పజిల్ మెయింటైన్ చేస్తూ టీజర్ ను కట్ చేశారు. దానికి ఆన్సర్ ‘లైలా’ ట్రైలర్ ఆరంభంలోనే ఇచ్చేశారు. అతని వల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి. తర్వాత అల్లర్లు కూడా జరిగే పరిస్థితి వస్తుంది. ఇక సోనూ ప్రాణాలకి గండం కూడా ఉందని తెలిసి.. లేడీ గెటప్ వేసుకుంటాడు.
అయితే ఎవరి వల్ల అతనికి ప్రమాదం ఉందో.. వాళ్ళ దగ్గరే అమ్మాయిగా అంటే లైలాగా ఇరుక్కోవాల్సి వస్తుంది. అది ఎందుకు? చివరికి అతను ఎలా బయటపడ్డాడు? అనేది మిగిలిన కథ అని తెలుస్తుంది. ట్రైలర్లో కామెడీ అందులోనూ విశ్వక్ సేన్ మార్క్ డబుల్ మీనింగ్ డైలాగుల కామెడీ టచ్ ఎక్కువగా ఉంది. థియేటర్లలో అది ఫుల్లుగా నవ్వించే అవకాశాలు కూడా ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :