తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకానొక సమయంలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి శ్రేయ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించారు. ఈ క్రమంలోనే ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమాలో అతనితో కలిసి సందడి చేశారు. ఇక ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. ఇలా చిరంజీవి శ్రేయ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ చాలా స్పెషల్ గానే ఉంటుందని చెప్పాలి.
ఇకపోతే మరోసారి ఈ సూపర్ జోడి స్క్రీన్ పైన మెరవనున్నట్లు తెలుస్తోంది. మరోసారి చిరంజీవి నటిస్తున్న సినిమాలో శ్రియ సందడి చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న భోళా శంకర్ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటించగా చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రేయ కూడా సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో శ్రేయ (Shriya) నటించబోతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం కోసం శ్రేయ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న శ్రేయ చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు సమాచారం.
కేవలం ఐదు నిమిషాల పాటు స్క్రీన్ పై ప్రసారమయ్యే పాట కోసం శ్రేయ ఇలా కోటి రూపాయలు డిమాండ్ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. అయితే ఈమెకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ సైతం ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.