బాయ్‌ ఫ్రెండ్‌తో శ్రుతి వైరల్ ఫొటోలు

శ్రుతి హాసన్‌కి చాలా ధైర్యం… అంతే స్థాయిలో బోల్డ్‌ కూడా. సమాజానికి భయపడి తన భావాల్ని మనసులోనే దాచేసుకునే రకం కాదు. గతంలో చాలా సందర్భాల్లో శ్రుతి హాసన్‌ ఇలా ప్రవర్తించడం చూశాం. తాజాగా వైరల్‌ అవుతున్న ఆమె పిక్స్‌ కొన్ని చూస్తే… ఆమె గట్స్‌కి వావ్‌ అనాల్సిందే. అంతేకాదు ‘శ్రుతి భలే నాటీ’ అని కూడా అంటారు. అంత నాటీ పనులు శ్రుతి ఏం చేసింది… ఎక్కడ చేసిందనేది చదివేయండి.

శ్రుతి హాసన్… గత కొంతకాలంగా శంతను హజారికా అనే ఆర్టిస్ట్‌తో రిలేషన్‌లో ఉందని వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై అమె ఎక్కడా అధికారికంగా ప్రేమను ప్రకటించలేదు. అయితే తాజాగా ఈ ఇద్దరూ ఓ సూపర్‌ మార్కెట్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా సరదాగా సెల్ఫీలు తీసుకొని పోస్ట్‌ చేసింది. ఒకటి సాధారణ సెల్ఫీ అయితే… రెండోది కిస్సింగ్‌ సెల్ఫీ. శంతను బాగా ముద్దొచ్చాడో ఏమో… మాస్క్‌తోనే ఓ మాస్క్‌ లాక్‌ ఇచ్చేసింది శ్రుతి.

ఇప్పుడు ఈ రెండు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. శంతనుతో శ్రుతి రిలేషన్‌లో ఉందని వాళ్లు వీళ్లూ చెప్పడమే కానీ… అఫీషియల్‌ సమాచారం లేదు అని ముందే అనుకున్నాం. ఇప్పుడు ఈ ముద్దు ఫొటోతో ఫుల్‌ క్లారిటీ వచ్చేసినట్లే. త్వరలోనే అచ్చ తమిళ్‌ పంచెకట్టులో శంతను హజారికాను చూడొచ్చన్నమాట. చూద్దాం కవ్వించే ఈ ఫొటో… స్థానంలో ఆ పద్ధతైన ఫొటో ఎప్పుడొస్తుందో!

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus