పెళ్లికి ఓకే చెప్పిన శృతి ?

విశ్వనటుడు కమలహాసన్ పెద్ద కుమార్తె  శృతిహాసన్ త్వరలో పెళ్లి పీటలపై కూర్చోనుంది. దక్షిణాది భాషా చిత్రాల్లో బిజీగా ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ ఓ ఇంటికి ఇల్లాలి కానుంది. వ్యాపార వేత్త, ఎన్ఆర్ఐ ని వచ్చే ఏడాది శృతి పెళ్లి చేసుకునేందుకు ఒకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భామ  హిందీలో యారా, తమిళంలో ఎస్ త్రీ, తెలుగులో ప్రేమమ్ సినిమాల్లో నటిస్తోంది.

తండ్రి కమల్  స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “శెభాష్ నాయుడు” చిత్రంలోనూ కనిపించనుంది. అంతే కాకుండా ఈ నెల 15 తర్వాత సెట్స్ మీదకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్ మూవీలోనూ శృతి కథానాయికగా నటించనుంది. ఈ చిత్రాలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఓ మంచి ముహూర్తాన పెళ్లి చేసికోనున్నట్లు తెలిసింది. ఈ నటి పెళ్లి తర్వాత సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేయదని టాక్. మంచి భార్యగా, ఇల్లాలిగా, తల్లి భాద్యతలను నెరవేర్చడానికి నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

ఇక నుంచి ఏ కొత్త సినిమా సైన్ చేసే ఆస్కారం లేదని శృతి సన్నిహిత వర్గాల వారు చెప్పారు. అయితే ఈ వార్తలను శృతి ఖండించలేదు. అవునని చెప్పలేదు. “సరే.. ఆ తర్వాత ఏంటి..” అంటూ నవ్వు ఐకాన్ లను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి మరింత సస్పెన్స్ కి తెరలేపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus