తెలుగు సినిమా తొలి నాళ్ళలో కధానాయిక అంటే కధకు తగ్గట్టు, తన పాత్రకు న్యాయం చేస్తే నాయిక అని అర్ధం వచ్చేలాగా ఉండే వారు. ఇక మరో పక్క మాస్ హృదయాలను దోచుకునేందుకు ఐటమ్ సాంగ్స్ లో హల్‌చల్ చేస్తూ కనిపించి కనిపించనట్లుగా…..చూపించి చూపించనట్లుగా కిర్రేకించే పాటల కోసం ఐటమ్ గర్ల్స్ అంటూ ప్రత్యేకంగా ఉండేవారు. కాల్ క్రమేణా సినిమాల్లోనే కాదు, హీరోయిన్స్ లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు తారలు పాత్రకు ప్రాణం పోస్తే ఇప్పుడు తారలు, పైసల కోసం, ఐటమ్ పాటకు చిందులు వేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత సినిమా పరిస్తితిని చూస్తే కధానాయికకు ప్రత్యేక పాత్ర అంటూ ఉండదు, హీరోతో సాంగ్స్ కోసమే, లేకపోతే విలన్ హీరోనూ ఇబ్బందుల్లో పెట్టడానికి ఉపయోగపడే పాత్ర కోసమే తప్పా ప్రస్తుతం తెలుగు సినిమాల్లో హీఓయిన్స్ ఏందుకు ఉపయోగపడరు అన్నది జగమెరిగిన సత్యం. ఉన్నదంతా చూపించడం, దొరికినంత సంపాదించుకోవడం, పెళ్లి చేసుకుని ఇతర దేశాల్లో సెటిల్ అయిపోవడం ఇదే నేటి తారల భాగోతం. భారీ హిట్స్ ఇచ్చిన భామలు, సమంతా, శ్రుతీ హాసన్, కాజల్ అగర్వాల్ లాంటి హిట్ హీరోయిన్స్ సైతం ఐటమ్ పాటలకు ఓకే చెప్పేస్తు ఉండడంతో, వాళ్ళు అందాల తారలో, లేక శృంగార తారలో తెలియక సగటు ప్రేక్షకుడు ఆవేదన చెందుతున్నాడు. మరో పక్క సినిమాల్లోనే కాకుండా సినీ ఇవెంట్స్, ప్రైవేట్ ఫంక్షన్స్ లో కూడా ఈ భామలు అందాల ఆరబోతకు సిద్దం అయిపోతుంటే చేసేది ఏమీ లేక నోరు వెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోతున్నారు. ఏది ఏమైనా…అందాల భామలు…అంగడి బొమ్మలుగా మారకుండా ఉంటే అంతే చాలు.