శ్రుతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మీరు ఫాలో అవుతుంటారా? అయితే ఈ ప్రశ్నకు మీరు చాలా ఈజీగా సమాధానం చెప్పేస్తారు. ‘శ్రుతికి నచ్చిన కలర్ ఏంటి?’… బాగా ఫాలో అయిన వాళ్లే కాదు, కొత్తగా ఇప్పుడే చూసేవాళ్లు కూడా ‘బ్లాక్’ అని ఈజీగా చెప్పేస్తారు. ఎందుకంటే ఆమె ఫొటోలు, వీడియోలు అలానే ఉంటాయి. బ్యాగ్రౌండ్ నుండి డ్రెస్సులు, ఆర్నమెంట్‌ల వరకు కచ్చితంగా బ్లాక్ షేడ్స్‌లోనే ఉంటాయి. ఈ విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
అందరూ అందరికీ నచ్చరు. ఎవరైనా నన్ను దెయ్యం, భూతం అని పిలిచినా ఆ మాటల్ని పొగడ్తలగానే భావిస్తాను అని శ్రుతి హాసన్ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో తరచూగా తనపైన ట్రోల్స్ వస్తుండటంతోనే ఈ విధంగా స్పందించింది అని అంటున్నారు. ఒక మహిళా నటి పొగడ్తలే కాదు, విమర్శలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇతరుల అభిప్రాయాలకు భయపడటం, బాధ పడటంలాంటివి చేయను అని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది శ్రుతి హాసన్.
నాకు నలుపు రంగు, లోహాభరణాలు ధరించడం అంటే చాలా ఇష్టం. సంగీతంపై ఇష్టం ఉన్నవారు మెటల్స్ ఎక్కువగా ధరిస్తారు అని అనుకుంటారు. కానీ వాళ్లు మాత్రమే కాదు చాలామంది అలాంటి ఆర్నమెంట్స్ ధరిస్తారు అని చెప్పింది శ్రుతి. అలాంటి దుస్తులు, ఆర్నమెంట్స్ వల్ల తనలో శక్తిని రెట్టింపు చేస్తాయి అని చెప్పారామె. అయితే ఆ ఆభరణాలు నచ్చని కొందరు దెయ్యంలా ఉన్నావని కామెంట్ చేస్తుంటారని చెప్పింది.
అందుకు తాను అలాంటి ట్రోల్స్‌ని పట్టించుకోను అని చెప్పేసింది (Shruti Haasan) శ్రుతి. మీరు నేచురల్ బ్యూటీ కాదట కదా.. మీ గురించి ఈ విషయంలో విమర్శలు వస్తున్నాయి అని అంటే… ‘విమర్శలు ఏముంది… ఆ విషయంలో నేనే ఒప్పుకుంటాను. అయితే అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు ఇష్టపడతా’ అని చెప్పేసింది శ్రుతి. 2023లో ఆమె మూడు బ్లాక్‌బస్టర్లలో నటించింది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’, ‘సలార్ 1’ సినిమాలతో వచ్చింది.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!