స్నేహ పూర్వకంగానే విడిపోయాం : మైకేల్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ టాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,రాంచరణ్,అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించింది ఈ భామ. కెరీర్ పీక్స్ లో ఉన్న టైములో ప్రేమలో పడి సినిమాలను తగ్గించేసింది. లండన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ కోర్సేల్ తో పీకల్లోతు ప్రేమాయణం సాగించింది. ఇద్దరి ఇళ్లల్లో కూడా వీరి ప్రేమ విషయం తెలుసు.. త్వరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ జంట విడిపోయిందట.

ఈ విషయాన్ని స్వయంగా శృతి బాయ్ ఫ్రెండ్ అయిన.. మైకేల్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. మైకేల్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ”జీవితం మమ్మల్నిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచింది. దురదృష్టవసాత్తు మేమిద్దరం ఒంటరి మార్గాల్లో నడవాల్సి వస్తుంది. కానీ ఈ యంగ్ లేడీ ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ గానే మిగిలిపోతుంది. ఆమెకి జీవితాంతం స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను” అంటూ పేర్కొంటూ…. శృతితో దిగిన ఓ ఫోటోని పోస్ట్ చేసాడు. మూడేళ్ల క్రితం శృతి లండన్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మైకేల్ ని కలిసింది. ఆ తరువాత ఇద్దరూ స్నేహితులుగా మారడం, అది కాస్త ప్రేమగా మారడం జరిగాయి. అయితే చివరికి ఈ జంట విడిపోయింది. వీరిద్దరూ స్నేహ పూర్వకంగానే విడిపోయినట్టు వీరి సన్నిహిత వర్గం చెప్పుకొస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus