శృతి హాసన్ (Shruti Haasan) .. పరిచయం అవసరం లేని పేరు. కమల్ హాసన్ (Kamal Haasan) కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ చూపించింది. అయితే బాలీవుడ్లో రూపొందిన ‘లక్’ తో హీరోయిన్ గా మారింది. అటు తర్వాత ‘అనగనగా ఓ ధీరుడు’ (Anaganaga O Dheerudu) అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చినా.. బ్రేక్ ఇచ్చిన మూవీ అంటే ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) అనే చెప్పాలి.
దాని తర్వాత ఆమెకు వరుస సక్సెస్ లు లభించాయి. మధ్యలో సినిమాలకి గ్యాప్ ఇచ్చినా రీ ఎంట్రీలో కూడా ఆమె హవా ఎంత మాత్రం తగ్గలేదు. గత ఏడాది అంటే 2023 లో చూసుకుంటే ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ‘హాయ్ నాన్న’ (Hi Nanna) (గెస్ట్ రోల్) ‘సలార్’ (Salaar) వంటి 4 హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మరోపక్క ఈమె సినిమాలతో పాటు డేటింగ్ వ్యవహారాలతో కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది అని చెప్పాలి.
మొదట్లో ఈమె హీరో సిద్దార్థ్ తో (Siddharth) ప్రేమాయణం నడిపినట్టు ప్రచారం జరిగింది. అతనికి బ్రేకప్ చెప్పాక ధనుష్ తో (Dhanush) కూడా సన్నిహితంగా మెలిగినట్టు టాక్ నడిచింది. అటు తర్వాత నాగ చైతన్యతో (Naga Chaitanya) కూడా ఈమె డేటింగ్ చేసినట్టు చాలానే వార్తలొచ్చాయి. ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా కూడా శృతి హాసన్ తో సహజీవనం చేసినట్టు ప్రచారం జరిగింది.
ఇక కొంత కాలానికి మైకేల్ కోర్సలే తో ప్రేమాయణం నడిపిందే కాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు శృతి హాసన్ హింట్స్ ఇచ్చింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా వీరు బ్రేకప్ చెప్పేసుకున్నారు. మళ్ళీ శాంతను అనే వ్యక్తితో కూడా కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న శృతి హాసన్ ఇప్పుడు అతనికి కూడా గుడ్ బై చెప్పేసినట్టు తెలుస్తుంది. గతంలో పెళ్లి పై నమ్మకం కూడా లేదన్నట్టు శృతి హాసన్ ఓ సందర్భంలో తెలియజేసిన సంగతి తెలిసిందే.