Shruti Haasan: డంకీ వర్సెస్ సలార్.. శృతి హాసన్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నా ఆ తర్వాత కెరీర్ ఆశించిన రేంజ్ లో పుంజుకోలేదనే సంగతి తెలిసిందే. సలార్ సినిమాతో శృతి హాసన్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. అయితే డిసెంబర్ నెలలో ఒక్కరోజు గ్యాప్ తో డంకీ, సలార్ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.

డంకీ వర్సెస్ సలార్ పోటీ గురించి తాజాగా శృతి హాసన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్ వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తక్కువ సమయంలోనే శృతి హాసన్ ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకోవడం గమనార్హం. తండ్రికి తగ్గ కూతురిగా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ తన టాలెంట్ తో ఆశ్చర్యపరిచిన సందర్భాలు సైతం ఉన్నాయి. బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సత్తా చాటిన ఈ బ్యూటీ సలార్ మూవీలో భాగం కావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు.

సలార్ చిత్రయూనిట్ నేను నేనుగానే ఉండేలా షూటింగ్ ను అనుభవించేలా చేశారని ఆమె చెప్పుకొచ్చారు. డంకీ సినిమాకు పోటీగా సలార్ రిలీజ్ కావడం గురించి ఎలాంటి భయం లేదని శృతి హాసన్ వెల్లడించారు. మా సినిమాపై మాకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని శృతి హాసన్ పేర్కొన్నారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో తాను నటిస్తున్న ఐ మూవీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆవిష్కరించేలా ఉంటుందని శృతి హాసన్ వెల్లడించారు. కొంతమంది నన్ను మంత్రగత్తె అంటూ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే తాను దానిని కూడా గర్వంగా భావిస్తానని వెల్లడించారు. తండ్రి కమల్ హాసన్ ఇచ్చే సలహాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయని అయితే పాటించలేకపోతున్నానని శృతి హాసన్ పేర్కొన్నారు. శృతి హాసన్ పారితోషికం ప్రస్తుతం 3.5 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో శృతి హాసన్ సంచలనాలను సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు. శృతి హాసన్ ను (Shruti Haasan) అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus