Shruti Haasan: ఆ వంటకాలు ఇష్టమంటున్న శృతిహాసన్!

గతేడాది క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న శృతి హాసన్ ఈ ఏడాది సలార్ సినిమాతో పాటు బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో సినిమాలతో సందడి చేయనున్నారు. ఈ రెండు సినిమాలలో శృతి హాసన్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శృతి హాసన్ నెటిజన్లతో ముచ్చటించారు. నెటిజన్లను శృతి తన ఫేవరెట్ విషయాల గురించి అడగాలని కోరారు.

ఏరోజు అంటే ఇష్టమనే ప్రశ్నకు స్పందిస్తూ తనకు శనివారం అంటే ఇష్టమని ఆరోజు అంటే ఎందుకు ఇష్టమో ప్రత్యేకంగా చెప్పలేనని ఆమె అన్నారు. శనివారం కాకుండా తనకు గురువారం ఇష్టమని ఆమె తెలిపారు. వర్కౌట్స్ లో స్విమ్మింగ్, డ్యాన్సింగ్‌ అంటే చాలా ఇష్టమని శృతి తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ను తాను చాలా ఎంజాయ్ చేస్తానని శృతి తెలిపారు. యోగా అంటే ఇష్టం ఉండదని ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని శృతి చెప్పుకొచ్చారు.

రోజా పూలు, లిల్లీ పూలను తాను ఎక్కువగా ఇష్టపడతానని శృతి హాసన్ వెల్లడించారు. సీతాఫలాలతో పాటు చెర్రీ పండ్లు కూడా నాకు ఎంతో ఇష్టమని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. దోసె, సాంబార్, రసం వడ తనకు ఇష్టమైన ఆహారం అని ఆమె అన్నారు. తాను తొలిసారిగా శంతనుని 2018 సంవత్సరంలో కలిశానని 2020 సంవత్సరం నుంచి తాను, శంతను రిలేషన్ షిప్ లో ఉన్నామని శృతి తెలిపారు. గిటార్ ను ప్లే చేయకపోయినా గిటార్ సౌండింగ్ ఇష్టమని శృతి వెల్లడించారు.

గిటార్ ను ప్లే చేయలేను కాబట్టి పియానో నా ఫేవరెట్ అని శృతి వెల్లడించారు. స్ట్రయిట్‌ హెయిర్‌ లేదా కర్లీ హెయిర్ లలో స్ట్రయిట్ హెయిర్ ఇష్టమని శృతి హాసన్ పేర్కొన్నారు. ఏఆర్‌ రెహమాన్‌ తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అని శృతి హాసన్ అన్నారు. నా హార్ట్, నా బ్రెయిన్ శరీరంలో ఇష్టమైన అవయవాలని శృతి హాసన్ వెల్లడించారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus