Shruti Haasan: సినిమాలలో నటించాలంటే వయసుతో సంబంధం లేదు: శృతిహాసన్

కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రుతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక వచ్చే ఏడాది ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా విడుదల కానున్నాయి. సంక్రాంతి కానుకగా ఈమె నటించిన సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ సినిమాలలో నటించాలంటే వయసుతో ఏమాత్రం సంబంధం లేదని

వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని తెలిపారు. సోషల్ మీడియాలో నటీనటుల వయసు గురించి ఎన్నో రకాల వార్తలు వస్తుంటాయి. అయితే వాటి గురించి తాను పెద్దగా పట్టించుకోనని కేవలం తాను తను నటించే పాత్రలపై మాత్రమే దృష్టి పెడతానని తెలిపారు. ప్రతి ఒక్క నటీనటులు తాము చేసే పాత్రలు ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటారు. అయితే కొన్ని పాత్రలు వారికి నచ్చవచ్చు మరికొన్ని నచ్చకపోవచ్చు. నేను ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో చాలామంది నేను నటించిన పాత్రలను ఇష్టపడలేదు.

అయితే నేను ప్రతి సినిమాకు నాలో నా నటన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా కొత్త విషయాలను తెలుసుకున్నానని ఈమె తెలిపారు. మొదట్లో నన్ను ఎవరు ఒప్పుకోకపోయినా ఇప్పుడు సినిమాల పట్ల నాకు ఉన్న తపన అందరికీ అర్థమైంది. అందుకే నన్ను ఇంతలా ఆదరిస్తున్నారని తెలిపారు. ఇలా తనని ఆదరించినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సందర్భంగా శృతిహాసన్ ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఈమె నటించిన వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి రెండు సినిమాలు కూడా సంక్రాంతికి పోటీపడబోతున్నాయి. మరి ఈ సంక్రాంతి బరిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో తెలియాల్సి ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus